Darbar - Dhummu Dhooli Song: దుమ్మురేపుతున్న దర్బార్ సినిమాలోని 'దుమ్ము ధూళి' సాంగ్, అనిరుధ్ మాస్ బీట్స్‌కి, సూపర్ స్టార్ క్లాస్‌కి ఫ్యాన్స్ ఫిదా, టాలీవుడ్ సూపర్ స్టార్‌తో ఢీకొట్టడానికి రజినీ దర్బార్ రెడీ

అదే సమయంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో 'అల వైకుంఠపురములో' కూడా విడుదలవుతున్నాయి....

Darbar Song Unveiled | Photo: LYCA Productions.

సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth) నటిస్తున్న మరో మాస్ ఎంటర్టైనర్ 'దర్బార్' (Darbar). ఈ సినిమాలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.  సెన్సేషన్ డైరెక్టర్ ఏ. ఆర్. మురుగదాస్ (AR Murugadoss) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రజినీ లుక్ ఎలా ఉంటుందో ఇప్పటికే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ల ద్వారా చూపించారు. తలైవార్ మాస్ మెస్మరిజానికి సోషల్ మీడియాలో దర్బార్ ట్రెండ్ అవుతూనే.  ఇప్పుడు ఈ సినిమాలోంచి ఒక మాస్ సాంగ్ రిలీజ్ చేసి అభిమానులను షేక్ చేయిస్తున్నారు సినిమా యూనిట్ వారు. తెలుగులో 'దుమ్ము ధూళి ' (Dhummu Dhooli ) అంటూ సాగుతూ పోయే ఈ పాట లిరిక్స్ మరియు మ్యూజిక్ నిజంగా దుమ్మురేపేలా ఉంది. నాప్ దే కిల్లీ ( Nap De Killi) అని హిందీలో, 'చుమ్మా కైజి' అని తమిళంలో ఇలా మూడు భాషల్లో ఈ పాటను విడుదల చేశారు.

రజినీ గత చితం 'పేట' సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్తర్ అనిరుధ్ రవిచందర్, దర్బార్ కు సాంగ్స్ కంపోజ్ చేశాడు. పేట సాంగ్ మరణమాస్ ఎంత హిట్ అయిందో తెలుసు, ఇప్పుడు దుమ్ము ధూళి సాంగ్ కూడా అదే రేంజ్ లో ఉంది. పెప్పీ మాస్ ట్రాక్ తలైవర్ అభిమానులను ఉర్రూతలూగిస్తుంది.

Check Out The Song Below: 

దర్బార్ లో రజనీకాంత్, నయనతార, సునీల్ శెట్టి, నివేదా థామస్, కునాల్ కెమ్ము, రవి కిషన్ మరియు సౌరభ్ శుక్ల లాంటి స్టార్లు నటిస్తున్నారు. మామూలుగా రజినీ సినిమా అంటే అంచనాలు ఎప్పుడూ భారీగానే ఉంటాయి. సంక్రాంతికి ఈ సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో 'అల వైకుంఠపురములో' కూడా విడుదలవుతున్నాయి. మరి సంక్రాంతి బరిలో ఎవరూ విజేతగా నిలుస్తారో చూడాలి. ఈ మూడింటిలో మీ ఫేవరేట్ మూవీ ఏదో కమెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి.