Saisha Shinde: చిన్నప్పుడే నాపై లైంగిక వేధింపులు, అందుకే గే గా మారావని అన్నారు, షాకింగ్ విషయాలను వెల్లడించిన ఫ్యాషన్ డిజైనర్ ట్రాన్స్‌జెండర్‌ సైషా షిండే

బాలీవుడ్‌ వివాస్పద బ్యూ​​టీ కంగనా రనౌత్‌ ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు హోస్ట్‌గా కొనసాగుతున్న సంగతి విదితమే. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన రియాలిటీ షో 'లాకప్‌'కు కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఈ షో ఇటీవలి జడ్జిమెంట్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌లో మునావర్ ఫరూఖీ తన లైఫ్‌ సీక్రెట్‌ను చెప్పాడు.

Lock Upp Contestant Saisha Shinde Says Transwomen Are Stripped Publicly to Prove Their Gender

బాలీవుడ్‌ వివాస్పద బ్యూ​​టీ కంగనా రనౌత్‌ ఓ వైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు హోస్ట్‌గా కొనసాగుతున్న సంగతి విదితమే. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన రియాలిటీ షో 'లాకప్‌'కు కంగనా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. ఈ షో ఇటీవలి జడ్జిమెంట్‌ స్పెషల్‌ ఎపిసోడ్‌లో మునావర్ ఫరూఖీ తన లైఫ్‌ సీక్రెట్‌ను చెప్పాడు. తన ఆరేళ్ల వయసులో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెబుతూ ఎమోషనల్‌ అయ్యాడు. తర్వాత కంగనాకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని చెప్పి షాక్‌కు గురి చేసింది.

ట్రాన్స్‌జెండర్‌ సైషా షిండేను ఎవిక్షన్‌ నుంచి కాపాడేందుకు తన సీక్రెట్‌ ఒకటి చెప్పాలని కంగనా అడగ్గా మునావర్ ఈ విషయం తెలిపాడు. అయితే వీరి తర్వాత ఎవిక్షన్‌ సేవ్ అయిన సైషా షిండే (fashion designer Saisha Shinde) తను ఎలాంటి వేధింపులను ఎదుర్కుందో లాకప్‌ వేదికగా తెలియజేసింది. 'ఇది నా మొదటి సీక్రెట్. మీకు (మునావర్ ఫరూఖీ, కంగనా రనౌత్) జరిగిన లైంగిక వేధింపులను (sexually assaulted) మీరు పంచుకోవడం చూశాక, అది విని ప్రజలు ఎలా రియాక్టయ్యారో చూశాక నాకు జరిగింది గుర్తుకు వచ్చింది. నేను కూడా లైంగిక వేధింపులకు (sexually assaulted as a child) గరయ్యాను. ఈ విషయం చెప్పినప్పుడు కొంతమంది వ్యక్తులు 'ఇందుకేనా నువ్‌ స్వలింగ సంపర్కురాలివి అయ్యావా (గే)' (this is why you are gay) అని అన్నారు. అలా అన్నాక ఇక ఎవ్వరికీ ఈ విషయం గురించి చెప్పే సాహసం చేయలేదు.'సైషా తాను స్వప్నిల్ షిండేగా ఉన్న సమయం గురించి పలుసార్లు తెలిపింది.

మీకో దండం.. నేను ప్రెగ్నెంట్ కాదు, ఓ ఈవెంట్‌కి వెళుతూ మామిడి కాయతో ఫోటో పెట్టా, ఫేక్‌న్యూస్‌ ప్రచారం చేయకండని తెలిపిన యాంకర్‌ శివజ్యోతి

ఆ సమయంలో తనను తాను స్వలింగ సంపర్కాలు (గే) అని నమ్మిందట. సైషాగా మారాలని నిర్ణయించుకునేంత వరకు మానసికంగా ఎలా పోరాడిందో తరచుగా చెప్పేది. దీపికా పదుకొణె, కరీనా కపూర్‌ ఖాన్, కత్రీనా కైఫ్, శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్‌, సన్నీ లియోన్‌, తాప్సీ పన్ను, భూమి పడ్నేకర్‌, హీనా ఖాన్‌లతో సహా టాప్ ఎ-లిస్ట్‌ బాలీవుడ్‌ నటులతో ప్రముఖ డిజైనర్‌ స్వప్నిల్ షిండేగా పనిచేసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement