Hanuman Poster From Adipurush (PIC @ Prabhas Instagram)

Mumbai, April 06: ప్రభాస్(Prabhas) హీరోగా రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్(Adipurush). కృతిసనన్(Krithisanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ తో బాలీవుడ్(Bollywood) దర్శకుడు ఓం రౌత్(Om Raut) ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ని రాముడిగా చాలా గొప్పగా ఊహించుకున్నారు అభిమానులు, ప్రేక్షకులు. కానీ టీజర్ రిలీజ్ తర్వాత అంతా ఆశ్చర్యపోయారు. రామాయణం అనుకొని గొప్పగా అనుకుంటే ఇదేదో బొమ్మల సినిమా తీస్తున్నారు, మొత్తం గ్రాఫిక్స్ తోనే ఉంది అని విమర్శలు వచ్చాయి. పోనీ అలా అయినా రామాయణం చూపిస్తారు అనుకుంటే రామాయణం పాత్రలలోని కట్టు బొట్టు మార్చేశారు. అసలు ఇది రామాయణం ఏంటి అని మరింతమంది విమర్శించారు. ఇలా అన్ని వైపులా ఆదిపురుష్ సినిమాని ట్రోల్ చేశారు. మొదట 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రకటించినా ఈ విమర్శలు చూసి మరింత గ్రాఫిక్ వర్క్స్ చేయాలని సినిమాని 16 జూన్ 2023కి వాయిదా వేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు.

 

ప్రస్తుతం ఆదిపురుష్ గ్రాఫిక్స్ వర్క్ జరుగుతుంది. ఇటీవల శ్రీరామనవమికి రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్న ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. దీనిపై కూడా విమర్శలు వచ్చాయి. దీంతో సినిమా రిలీజ్ డేట్ ఏమన్నా మారుతుందా, మళ్ళీ వాయిదా పడుతుందా అని అంతా భావించారు. తాజాగా ఆదిపురుష్ సినిమా నుంచి హనుమంతుడి పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ పోస్టర్ లో వెనుక రాముడు ఫేస్ ఉండి ముందు హనుమంతుడు ధ్యానం చేసుకుంటున్నాడు. హనుమంతుడి పోస్టర్ ని షేర్ చేసి.. రాముడికి భక్తుడు, రామ కథకి ప్రాణం, జై పవన పుత్ర హనుమాన్ అని పోస్ట్ చేశారు.

Salaar Movie Release Date: ప్రభాస్ సలార్‌ నుంచి కొత్త అప్‌డేట్, అదిరిపోయే వీడియోను విడుదల చేసిన మేకర్స్, సెప్టెంబరు 28న విడుదల కానున్న మూవీ 

ఈ సినిమాలో హనుమంతుడిగా దేవ్‌దత్త నగే నటించాడు. దీంతో పాటే ఆదిపురుష్ సినిమా 16 జూన్ 2023 రిలీజ్ అవుతుందని మరోసారి కన్ఫర్మ్ చేశారు. దీంతో ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి దర్శకుడు ఓం రౌత్ ప్రేక్షకులని తన గ్రాఫిక్స్ తో మెప్పిస్తాడా చూడాలి.



సంబంధిత వార్తలు

Kalki 2898 Ad: ప్ర‌భాస్ పోస్టు పెళ్లి గురించి కాదు! క‌ల్కి నుంచి క్రేజీ అప్ డేట్ ఇచ్చిన డార్లింగ్, మూవీలో ప్ర‌భాస్ తో పాటూ బుజ్జి

Astrology: 108 లవంగాలతో హనుమంతునికి ఇలా పూజ చేస్తే 21 రోజుల్లో కోటీశ్వరులు అవ్వడం ఖాయం..

Hanuman Jayanthi 2024 Wishes: మీ బంధు మిత్రులకు హనుమాన్ జయంతి సందర్బంగా Full HD Images ద్వారా Greetings తెలియజేయండి..

Hanuman Jayanthi Wishes: హనుమాన్ జయంతి సందర్భంగా మీ స్నేహితులకు Photo Greetings ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి..

Hanuman Jayanti Telugu Wishes: హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ హనుమజ్జయంతి విషెస్ చెప్పేద్దామా..

Hanuman Jayanti 2024:: హనుమాన్ జయంతి రోజున పఠించాల్సిన 7 శక్తివంతమైన మంత్రాలు ఇవిగో, రోజూ చదివితే మీకు కొండంత ధైర్యం వస్తుంది

This Week Movies- OTT Releases: ఈ నెల 26 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో టిల్లూ స్క్వేర్ సినిమా స్ట్రీమింగ్, ఈవారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే కొత్త చిత్రాలు ఇవిగో,,

Kalki 2898 AD: అమితాబ్ ఇంత యంగ్ గా మారిపోయాడేంటి? క‌ల్కిలో బిగ్ బీ క్యారెక్ట‌ర్ టీజ‌ర్ రిలీజ్, షాక్ అవుతున్న ఫ్యాన్స్