Happy Birthday AR Rahman: చదివింది తక్కువ..,11 ఏళ్లకే నెత్తిన బరువు బాధ్యతలు, తొలి సినిమాకే జాతీయ అవార్డ్, జాతీయ స్థాయిలో ఆరు సార్లు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మ్యూజిక్ లెజెండ్ ఎ. ఆర్. రెహమాన్ పుట్టిన రోజుపై విశ్లేషణాత్మక కథనం

ఆర్. రెహమాన్.. ( AR Rahman)ఈ పేరు సంగీత ప్రపంచంలో తెలియని వారు ఎవరూ ఉండరు. భారతీయ సంగీతాన్ని(Indian Music) విశ్వవ్యాప్తం చేసిన స్వర మాంత్రికుడుగా ఆయనంటే అందరికీ ఓ ఎనర్జీ. ట్రెడిషనల్ క్లాసిక్స్ ( Indian classical music )నుంచి పాప్ వరకూ అన్ని రకాల మ్యూజిక్స్‌ను మిక్స్ చేసి మ్యాజిక్ చేయగల అనితర సాధ్యుడు.

AR Rahman (Photo Credits: Twitter)

Mumbai, January 06: అల్లా రఖా రెహమాన్ (Allahrakka Rahman) అలియాస్ ఎ. ఆర్. రెహమాన్.. ( AR Rahman)ఈ పేరు సంగీత ప్రపంచంలో తెలియని వారు ఎవరూ ఉండరు. భారతీయ సంగీతాన్ని(Indian Music) విశ్వవ్యాప్తం చేసిన స్వర మాంత్రికుడుగా ఆయనంటే అందరికీ ఓ ఎనర్జీ. ట్రెడిషనల్ క్లాసిక్స్ ( Indian classical music )నుంచి పాప్ వరకూ అన్ని రకాల మ్యూజిక్స్‌ను మిక్స్ చేసి మ్యాజిక్ చేయగల అనితర సాధ్యుడు.

భారతీయ సంగీత ప్రపంచంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్.. ఆయన పాటల్లో మనసును తాకే మధురమైన సంగీతమే కాకుండా హుషారెత్తించే ఫాస్ట్ బీట్స్ కూడా ఉంటాయి. జనవరి 6న ఈ స్వర మాంత్రికుడి పుట్టినరోజు((Happy Birthday AR Rahman) సందర్భంగా స్పెషల్ స్టోరీ...

రెహమాన్ జన్మనామం ఎ. ఎస్. దిలీప్ కుమార్. తండ్రి నుంచి సంగీత వారసత్వం పుచ్చుకున్న రెహమాన్ చిన్నతనంలో తండ్రి మరణంతో కుటుంబాన్ని పోషించడానికి పలువురు సంగీత దర్శకుల దగ్గర సహాయకుడిగా పనిచేశాడు. వాణిజ్య ప్రకటనలకు సంగీతం సమకూర్చాడు. తర్వాత మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో వచ్చిన రోజా( Roja) చిత్రానికి కూర్చిన సంగీతంతో మంచి పేరు వచ్చింది. మొదటి సినిమాతోనే ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం( National Film Award) దక్కింది.

జీవితపు పాఠాలు

రెహ్మాన్‌ అసలు పేరు ఎ. ఎస్‌. దిలీప్‌ కుమార్‌. తండ్రి ఆర్. కె. శేఖర్, తల్లి కస్తూరి. శేఖర్ సంగీత దర్శకుడు. ఆలయాల్లో భజన పాటలు పాడేవాడు. రెహమాన్ కు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు. అక్క కొడుకు జి. వి. ప్రకాష్ కూడా ప్రముఖ సంగీత దర్శకుడిగా ఎదిగాడు. నాలుగేళ్ళ వయసు నుంచే తండ్రి దగ్గర పియానో వాయించడం నేర్చుకున్నాడు. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. ఆ సమయంలో ఇంట్లోని సంగీత పరికరాల్ని అద్దెకిస్తూ కుటుంబాన్ని పోషించేది తల్లి. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళు- పేదరికం.

కుటుంబ బాధ్యతలు

11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా, రమేష్ నాయుడు, రాజ్ కోటి లాంటి పలు సంగీత దర్శకుల ట్రూప్‌లో పనిచేస్తూ జీవితం ప్రారంభించాడు. దూరదర్శన్ వండర్ బెలూన్ అనే ఒక కార్యక్రమంలో ఒకేసారు నాలుగు కీబోర్డులు వాయిస్తూ కనిపించాడు. పనిలో పడి బడికి సరిగా వెళ్ళలేక పోయాడు. సంగీత దర్శకులు కూడా సొంత పరికరాలు కొనుక్కోవడంతో వీరి అద్దె వ్యాపారానికి గిరాకీ తగ్గింది.

దాంతో తల్లి కూడా అతన్ని చదువు మానేసి సంగీతం మీదనే దృష్టిపెట్టమని చెప్పింది. మొదట్లో చదువుకోలేకపోయినందుకు అసంతృప్తి చెందినా తరువాత జీవిత పాఠాలు నేర్చుకున్నందుకు సంతోషపడ్డాడు. 1987 లో చెన్నై లోని కోడంబాకం లోకి వచ్చిన రెహమాన్ కుటుంబం అప్పటి నుంచీ అక్కడే ఉంటోంది. అమెరికాలోని లాస్ ఏంజిలెస్ లో కూడా రెహమాన్ కు ఓ ఇల్లుంది. పని ఒత్తిడి నుంచి బయటపడ్డానికి, సాధారణ జీవితం గడపడానికి అక్కడికి వెళుతూ ఉంటాడు.

తల్లి నగలు అమ్మి తల్లి నగలు అమ్మి..

తల్లి నగలు అమ్మి ఆధునిక హంగులతో ఇంట్లోనే ఒక స్టూడియో ప్రారంభించాడు. రెహమాన్ తల్లికి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ఇంట్లో హిందూ దేవుళ్ళతోపాటు మేరీమాత, మక్కా మదీనా చిత్రాలు కూడా ఉండేవి. భర్త చనిపోయిన తర్వాత ఆమె ప్రశాంతత కోసం నెల్లూరు జిల్లా, తడ దగ్గరలోని సూఫీ ప్రవక్ర కరీముల్లా షా ఖాద్రీ బోధనలకు ఆకర్షితులై వీరి కుటుంబం 1989వ సంవత్సరంలో ఇస్లామ్‌లోకి మారింది. ఇది జరగక మునుపే చెల్లెలు పెళ్ళి కోసం ఓ జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్ళారు. అప్పటికే దిలీప్ అనే పేరు అంతగా నచ్చని రెహమాన్ తనకు పేరు మార్చుకోవాలని ఉందని ఆయన్ను అడిగాడు.

ఆయన అబ్దుల్ రహీమ్ కానీ అబ్దుల్ రెహమాన్ కానీ పేరు మార్చుకుంటే అంతా మంచే జరుగుతుందని సలహా ఇచ్చాడు. రెహమాన్ అనే పేరు నచ్చడంతో అప్పటి నుంచి అలాగే పేరు మార్చుకున్నాడు. తల్లి ఆ పేరు ముందు అల్లా రఖా అనే పేరును చేర్చింది. ఆమె కూడా తన పేరును కరీమాగా మార్చుకుంది. కాగా రెహమాన్ కడప లోని పెద్ద దర్గా, కసుమూరు దర్గా, నెల్లూరు జిల్లాలోని వేనాడు దర్గాలను తరచూ సందర్శిస్తారు.

దాదాపు రెండు దశాబ్ధాలకు పైగా కొనసాగిన రహమాన్ సంగీత ప్రస్థానంలో.. ఏ భారతీయ సంగీత దర్శకుడూ చేరుకోలేని ఉన్నత శిఖరాల్ని అందుకున్నాడు.కెరియర్ ప్రారంభంలో వెస్టర్న్ మ్యూజిక్ ను ఫాలో అవుతున్నాడంటూ ఎన్నో విమర్శలొచ్చాయి. వాటికి తన కంపోజింగ్స్‌తోనే సమాధానం చెప్పాడు రెహమాన్. మ్యూజిక్ కంపోజ్ చేసిన మొదటి సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును అందుకున్నాడు.

రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేయడమే కాదు... మంచి సింగర్, సాంగ్ రైటర్, మల్టీ ఇన్ట్రుమెంటలిస్ట్ కూడా. ఎన్నో సినిమాలకు పాటలు రాసి.. అద్భుతంగా పాడాడు. ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా కంపోజ్ చేసాడు. కర్నాటక సంగీతాన్ని, ఖవ్వాలీ స్టయిల్‌ను, రెగే, హిప్-హాప్, ర్యాప్, రాక్, పాప్, జాజ్, ఒపెరా, సూఫీ ఆఫ్రికన్, అరేబియన్, వెస్టర్న్ మ్యూజిక్‌లను పర్ఫెక్ట్ గా మిక్స్ చేస్తాడు. వాటితో పూర్తిస్థాయిలో ఒరిజినల్ బాణీలతో ఆకట్టుకున్న సంగీత దర్శకుడుగా గుర్తింపు పొందాడు.

వందేళ్లకు పైగా కొనసాగుతున్న భారతీయ చిత్ర పరిశ్రమకు.. ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డు ఒక కల. ఆ లోటును కూడా రెహమాన్ తీర్చాడు. రెహమాన్ మ్యూజిక్ అందించిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ slumdog millionaire)చిత్రంలో కంపోజ్ చేసిన ‘జయహో’ (Jai Ho)పాటకు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి. రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకుని భారతీయ సినిమాలను అంతర్జాతీయ వేదికపైకి సగర్వంగా తీసుకెళ్లిన ఘనత రెహమాన్‌కే దక్కుతుంది. టైమ్ మ్యాగజైన్ రెహమాన్ కు మొజార్ట్ ఆఫ్ మద్రాస్ బిరుదు ఇచ్చింది.

జాతీయ స్థాయిలో ఆరు సార్లు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, హిందీ, తమిళ చిత్రాలకు ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులను, తమిళ ప్రభుత్వ అవార్డులను అందుకున్నాడు. కేంద్రం నుంచి ‘పద్మశ్రీ’, ‘పద్మభాషణ్’ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నాడు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif