Balakrishna Fire on Fan Video: కళ్లజోడు చూసుకోవా అంటూ అభిమాని మీద ఫైర్ అయిన బాలకృష్ణ, ఊహించని పరిణామంతో చిన్నబుచ్చుకున్న అభిమాని, వీడియో వైరల్
ఈ క్రమంలో బాలయ్య తలపై ఉన్న కళ్లజోడు ఆ అభిమాని చేయి తగిలి పడిపోయింది. దాంతో నందమూరి హీరో ఆ అభిమానిపై ఓ సీరియస్ లుక్కేశారు. కళ్లద్దాలు చూసుకోవా అంటూ విసుక్కున్నారు
బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ నేడు ఒంగోలులో జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బాలకృష్ణకు ఒంగోలులో ఘనస్వాగతం లభించింది. బాలయ్యను చూసేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ నడిచి వస్తుండగా, ఓ అభిమాని శాలువా కప్పేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బాలయ్య తలపై ఉన్న కళ్లజోడు ఆ అభిమాని చేయి తగిలి పడిపోయింది. దాంతో నందమూరి హీరో ఆ అభిమానిపై ఓ సీరియస్ లుక్కేశారు. కళ్లద్దాలు చూసుకోవా అంటూ విసుక్కున్నారు. ఆ అభిమాని ఈ ఊహించని పరిణామంతో చిన్నబుచ్చుకున్నాడు. భయపడుతూనే శాలువా కప్పగా, ఆ శాలువాను బాలయ్య వెంటనే తీసేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.