Allu Arjun Released: అల్లు అర్జున్@ ఖైదీ నంబర్ 7697.. జైలు అధికారులు డిన్నర్ ఆఫర్ చేసినా తీసుకోని పుష్పరాజ్..

నిన్న రాత్రంతా చంచల్‌ గూడ జైలులో గడిపి కాసేపటి క్రితమే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అయ్యారు. హైకోర్టు బెయిల్‌ పత్రాలు ఆన్‌ లైన్‌ లో అప్‌లోడ్‌ కాకపోవడం, ఇతర కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరగడంతో శుక్రవారం రాత్రంతా అల్లు అర్జున్‌ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Allu Arjun released (Credits: X)

Hyderabad, Dec 14: నిన్న రాత్రంతా చంచల్‌ గూడ జైలులో (Chanchalguda Jail) గడిపి కాసేపటి క్రితమే అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల (Allu Arjun Released) అయ్యారు. హైకోర్టు బెయిల్‌ పత్రాలు ఆన్‌ లైన్‌ లో అప్‌ లోడ్‌ కాకపోవడం, ఇతర కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరగడంతో శుక్రవారం రాత్రంతా అల్లు అర్జున్‌ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో జైలు అధికారులు ఆయన్ను అండర్‌ ట్రైల్‌ ఖైదీగా మంజీరా బ్యారక్‌ లో ఉంచారు. ఖైదీ నంబర్‌ 7697గా ఆయనకు నంబర్ ఇచ్చారు. జైలు అధికారులు డిన్నర్ ఆఫర్ చేసినా అర్జున్ తీసుకోలేదని సమాచారం. ఆయనకు కొత్త రగ్గు, కొత్త దుప్పటి అధికారులు ఇచ్చినట్టు తెలుస్తుంది.

చంచల్‌ గూడ జైలు నుంచి ఎట్టకేలకు అల్లు అర్జున్ విడుదల.. మీడియా కంట పడకుండా భారీ ఎస్కార్ట్ మధ్య ప్రిజన్స్ అకాడమీ గేటు నుంచి పుష్పను పంపించిన చంచల్‌ గూడ జైలు అధికారులు (వీడియో)

జైలులో ఇలా..

అయితే, హైకోర్టు ఉత్తర్వులు అందడంలో జాప్యం, బెయిల్ కాపీ హార్డ్ కాపీ కోసం అధికారులు అడగడంతో నిన్న బన్నీ విడుదల ఆలస్యమైంది. దీంతో రాత్రంతా చంచల్‌ గూడ జైలులోని మంజీరా బ్లాక్‌ లోనే బన్నీ గడిపారు.  జైలు గదిలో బన్నీని ముగ్గురు ఖైదీలు ఉండే బ్యారక్‌ లో ఉంచారు. అందులో ఆయనతో మరో ఇద్దరు విచారణలో ఉన్న ఖైదీలు ఉన్నట్టు సమాచారం.

దేవుడ్ని అరెస్ట్ చేస్తారా? అల్లు అర్జున్ అరెస్ట్ పై రామ్ గోపాల్ వ‌ర్మ నాలుగు ప్ర‌శ్నలు 

అసలేమైంది??

పుష్ప-2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా, నిన్న ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్‌ వేసిన విజయశాంతి, హిట్‌ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!

Vallabhaneni Vamsi Mohan Case: నాకు శ్వాసకోశ ఇబ్బంది ఉందని చెబుతున్నా పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వారి నుంచి నాకు ప్రాణ హాని ఉందని తెలిపిన వల్లభనేని వంశీ, 14 రోజుల రిమాండ్‌ విధించిన విజయవాడ కోర్టు

Hyderabad: బాలుడు అరుస్తున్నాడని నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా అత్యాచారం, కామాంధుడికి 20 ఏళ్ళు జైలు శిక్ష విధించిన హైదరాబాద్ ఫోక్సో కోర్టు

Advertisement
Advertisement
Share Now
Advertisement