Jailer Succes Meet: జైలర్‌ మూవీ యూనిట్‌కు గోల్డ్ కాయిన్స్‌, సినిమాకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ గిఫ్ట్‌లు ఇచ్చిన సన్‌ పిక్చర్స్‌

దాదాపు 300కు పైగా వర్కర్స్ కి గోల్డ్ కాయిన్స్ ని బహుమతిగా అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సన్ పిక్చర్స్ తమ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

Jailer Succes Meet

Chennai, SEP 10: ‘జైలర్’ సినిమాతో సూపర్ స్టార్ ర‌జినీకాంత్ (Rajinikanth) ఈ ఏడాది భారీ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. రమ్యకృష్ణ, త‌మ‌న్నా (Tamannaah), కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్ (Mohanlal), జాకీ ష్రాఫ్ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లు చేశారు. స‌న్ పిక్చ‌ర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ఈ చిత్రాన్ని 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తే.. బాక్స్ ఆఫీస్ వద్ద 600 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో నిర్మాత కళానిధి మారన్.. రజినీకాంత్‌కి, దర్శకుడు నెల్సన్‌కి, అనిరుద్‌కి లాభాల్లో వచ్చిన కొంత డబ్బుతో పాటు బ్రాండ్ కార్లను కూడా బహుమతిగా అందజేశాడు. అయితే అక్కడితోనే ఆగిపోలేదు. ఈ సినిమా కోసం పని చేసిన యూనిట్ కి కూడా కానుకలు అందజేశాడు. దాదాపు 300కు పైగా వర్కర్స్ కి గోల్డ్ కాయిన్స్ ని బహుమతిగా అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని సన్ పిక్చర్స్ తమ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ పోస్టు చూసిన నెటిజెన్స్.. “హీరో నుంచి సెట్ వర్కర్ వరకు ఇలా బహుమతులు ఇస్తున్నారంటే, నిర్మాతకు ఎంత లాభం వచ్చి ఉండి ఉంటుంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ ఇటీవలే ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అక్కడ కూడా అత్యధిక వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది. ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. దీనికి సీక్వెల్ తీసుకు వస్తాను అంటూ కూడా దర్శకుడు అనౌన్స్ చేసేశాడు. మరి ఆ సీక్వెల్ ఎప్పుడు పట్టాలు ఎక్కుతుందో చూడాలి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif