SIIMA Awards 2023: సైమా అవార్డ్స్ 2023 ఉత్తమ నటుడు ఎన్టీఆర్.. ఉత్తమ నటిగా శ్రీలీల.. ఉత్తమ చిత్రం 'సీతారామం'.. విజేతల పూర్తి వివరాలు ఇవిగో!
దుబాయ్ లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) - 2023 వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సెప్టెంబరు 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ వేడుక తొలి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన తారలు హాజరయ్యారు.
Hyderabad, Sep 16: దుబాయ్ లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) – 2023 (SIIMA Awards 2023) వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సెప్టెంబరు 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ వేడుక తొలి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన తారలు హాజరయ్యారు. 2023 సంవత్సరానికి గానూ ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ (NTR) అవార్డు అందుకున్నారు. 'RRR'లో ఆయన నటనకు గానూ అవార్డు వరించింది. అలాగే 'ధమకా'లో నటనకు శ్రీలీల (Sreeleela) ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్), ఉత్తమ చిత్రంగా సీతారామం ఎంపికయ్యాయి. విజేతల పూర్తి వివరాలు ఇవిగో..
'సైమా' 2023 అవార్డుల విజేతలు వీళ్లే!
- ఉత్తమ నటుడు: ఎన్టీఆర్ (ఆర్‌ఆర్‌ఆర్)
- ఉత్తమ నటి: శ్రీలీల (ధమాకా)
- ఉత్తమ దర్శకుడు: ఎస్.ఎస్.రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్)
- ఉత్తమ చిత్రం: సీతారామం (వైజయంతి మూవీస్)
- ఉత్తమ సహాయ నటుడు: రానా (భీమ్లా నాయక్)
- ఉత్తమ సహాయ నటి: సంగీత (మసూద)
- ఉత్తమ విలన్: సుహాస్ (హిట్2)
- ఉత్తమ హాస్య నటుడు: శ్రీనివాస్‌రెడ్డి (కార్తికేయ2)
- ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు): శరత్, అనురాగ్ (మేజర్)
- ఉత్తమ పరిచయ నటి: మృణాల్ ఠాకూర్ (సీతారామం)
- ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి (ఆర్‌ఆర్ఆర్)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్ కుమార్ (ఆర్‌ఆర్ఆర్)
- ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్ (నాటు నాటు)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిర్యాల (డీజే టిల్లు)
- ఉత్తమ పరిచయ దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార)
- సెన్సేషన్‌ఆఫ్ ది ఇయర్ : నిఖిల్, కార్తికేయ2
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అడవి శేష్ (మేజర్)
- ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాల్ ఠాకూర్ (సీతారామం)
- ప్రామిసింగ్ న్యూకమర్ (తెలుగు): బెల్లంకొండ గణేష్
- ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్: శ్రుతి హాసన్
Advertisement
సంబంధిత వార్తలు
2025 Oscar Awards LIVE: మొదలైన ఆస్కార్ అవార్డుల సంబురం.. ఏ క్యాటగిరీలో ఎవరు గెలిచారంటే? (లైవ్ వీడియో)
NTR Bharosa Pension Distribution: ఏసీ గదుల్లో కూర్చుంటే కష్టాలు తెలియవు.. అధికారులకు చంద్రబాబు హెచ్చరిక, రూ.200 పెన్షన్‌ని రూ.4వేలు చేశామని వెల్లడి
Pawan Kalyan Donates Rs 50 Lakhs To NTR Trust: ఎన్టీఆర్ ట్రస్ట్‌కు పవన్ కల్యాణ్ భారీ డొనేషన్, టికెట్ కొనలేదు అందుకే రూ. 50 లక్షలు ఇస్తున్నా అంటూ ప్రసంగం
Vallabhaneni Vamsi Arrest: ఉప సంహరించుకున్న కేసుపై అరెస్టు ఏమిటి? వల్లభనేని వంశీ అరెస్ట్‌ను ఖండించిన వైసీపీ నేతలు, ఎవరేమన్నారంటే..
Advertisement
Advertisement
Advertisement