My Best Friend Secret: పెళ్లికి ఇంకొన్ని రోజులు ఉందనగా పోర్న్ సైట్లో వరుడి వీడియో ప్రత్యక్షం అవుతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది? 'మీకు మాత్రమే చెప్తా' ఉన్నాం ఈ కథని, తెలుసుకోండి
పెళ్లికి ఇంకొన్ని రోజులే ఉందనగా రాకేశ్‌కి సంబంధించిన 'స్కాండల్' వీడియో ఒకటి పోర్న్ వెబ్‌సైట్లో ప్రత్యక్షమవుతుంది. అందులో రాకేశ్ పెర్ఫార్మెన్స్‌కి పోర్న్ వీక్షకుల నుంచి...
రాకేశ్ (తరుణ్ భాస్కర్) ను ఒక అమ్మాయి చాలా ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే అతడికి సిగరెట్, మందు మరియు అమ్మాయిలతో తిరగడం లాంటి చెడు అలవాట్లు ఏమి లేవు. ఈ పెళ్లి రాకేశ్‌కి చాలా ఇంపార్టెంట్, ఈ పెళ్లితోనే అతడి కెరియర్, రెప్యుటేషన్ అన్ని ముడిపడి ఉన్నాయి. అయితే అంతా కూల్‌గా సాగిపోతున్న వేళ పెళ్లికి ఇంకొన్ని రోజులే ఉందనగా రాకేశ్‌కి సంబంధించిన 'స్కాండల్' వీడియో ఒకటి పోర్న్ వెబ్‌సైట్లో ప్రత్యక్షమవుతుంది. అందులో రాకేశ్ 'పెర్ఫార్మెన్స్'కి పోర్న్ వీక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. అలాంటి సైట్లోకి తన సీక్రెట్ వీడియో ఎలా వెళ్లింది అని షాక్‌కు గురై, అది ఇంకా వైరల్ అవ్వకముందే ఎలాగైనా ఆ వీడియోను అందులో నుంచి తీసేయాలనుకుంటాడు. అందుకోసం తన ఫ్రెండ్ కామేశ్‌ను సహాయం కోసం ఆశ్రయిస్తాడు.
కామేశ్ ఒక హ్యాకర్, తన ఫ్రెండ్ రాకేశ్ సీక్రెట్స్ అన్ని తెలిసినవాడు. అయితే రాకేశ్ ఏం చేస్తాడు? , కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలిసుకోవాలంటే 'మీకు మాత్రమే చెప్తా' సినిమా చూడాలి. అందుకే ఈ సినిమాకి ట్యాగ్ లైన్ ట్యాగ్‌లైన్ 'మై బెస్ట్ ఫ్రెండ్ సీక్రెట్' అని పెట్టారు. టైటిల్, ట్యాగ్ లైన్ రెండూ కలిపిస్తే.. నా బెస్ట్ ఫ్రెండ్ సీక్రెట్ మీకు మాత్రమే చెప్తా!
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సొంత బ్యానర్ లో తనకు 'పెళ్లిచూపులు' లాంటి హిట్ సినిమాను అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ను హీరోగా పరిచయం చేస్తూ 'మీకు మాత్రమే చెప్తా' (Meeku Maathrame Cheptha) అనే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరిని నిర్మిస్తున్నాడు. షమీర్ సుల్తాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ పక్కన హీరోయిన్‌గా వాణి భోజన్ (Vani Bhojan) నటిస్తుంది. యాంకర్ అనుసూయ భరద్వాజ్, పావని గంగిరెడ్డి అలాగే తరుణ్ భాస్కర్ సినిమాల్లో కామన్‌గా కనిపించే కొంతమంది నటీనటులు ఈ సినిమాలోనూ కంటిన్యూ అవుతున్నారు.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా విజయ్ దేవరకొండ ఒక స్పెషల్ వీడియో సాంగ్ 'నువ్వే హీరో' ను విడుదల చేశాడు.
Nuvve Hero Music Video:
ఎవరి జీవితానికి వారే హీరో అనే లిరిక్స్ తో సాగే ఈ పాట మీకు నచ్చిందా? ఈ పాట ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి. ఇక మీకు మాత్రమే చెప్తా సినిమా నవంబర్ 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో నటిస్తున్నాడు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)