Techie's Sad Success Story (Photo-pixabay/Rep.)

రోజుకు 14 గంటలు పనిచేసే ఒక టెక్ ఎగ్జిక్యూటివ్ ఇటీవల తన నిరంతర ప్రమోషన్ ప్రయత్నంలో తన వివాహాన్ని ఎలా కోల్పోయాడో పంచుకున్నాడు. పేరుతో పాటు ఇతరత్రా వ్యక్తిగత వివరాలు వెల్లడించకుండా తన ఆవేదనను ఈ టెకీ Blind లో షేర్ చేసిన పోస్టులో వివరించాడు. మూడు సంవత్సరాలు చాలా కష్టపడి పనిచేశాడని, కొన్నిసార్లు రోజుకు 14 గంటలు పనిచేశాడని, తద్వారా తనకు ప్రమోషన్ లభించిందని వెల్లడించాడు.

పనిలో బిజీగా ఉండటం వల్ల తాను కోల్పోయిన అనేక ముఖ్యమైన కుటుంబ క్షణాలను పోస్టులో అతను వివరించాడు. అన్నీ కోల్పోయిన తరువాత చివరికి, అతను తన కెరీర్ లక్ష్యాలను సాధించగలిగానని చెప్పాడు. రూ. 7.8 కోట్ల అద్భుతమైన జీతంతో సీనియర్ మేనేజర్‌గా పదోన్నతి పొందడం అనేది ఒక ఎత్తు అయితే ఈ సమయంలో తన భార్య నుంచి విడాకులు తీసుకోవడం ద్వారా నా జీవితాన్ని పూర్తిగా కోల్పోయానని తెలిపాడు. ఓ చేతికి ప్రమోషన్ లెటర్, మరో చేతికి విడాకుల నోటీస్ అందుకున్నానంటూ వాపోతున్నాడు.

 రూ. 25 వేల పరిహారం ఇచ్చి 700 మంది ఫ్రెషర్లను తొలగించిన ఇన్ఫోసిస్, వెంటనే క్యాంపస్ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు, బలవంతంగా సంతకాలు..

మూడేళ్ల కిందట తాను ఓ కంపెనీలో సీనియర్ లెవల్ ఎగ్జిక్యూటివ్ గా చేరానని పోస్టులో చెప్పుకొచ్చాడు. ప్రమోషన్ కోసం రోజుకు 14 గంటలు పనిచేశానని వివరించాడు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతరం మీటింగ్ లతో బిజీబిజీగా ఉండేవాడినని చెప్పాడు. ఈ క్రమంలో తన కూతురు పుట్టిన సమయంలో భార్య పక్కన ఉండే అవకాశాన్ని వదులుకున్నట్లు వివరించాడు. ఆ సమయంలోనూ తాను వర్క్ లో మునిగిపోయానని, ప్రసవం తర్వాత తన భార్య మానసికంగా ఒడిదుడుకులకు గురైందని చెప్పాడు.

Techie's Sad Success Story:

View on Blind

</>

కౌన్సిలింగ్ కోసం డాక్టర్ ను కలిసేందుకు భార్య వెళితే తాను తోడుగా వెళ్లలేదన్నాడు. బంధుమిత్రులను కలవడం, శుభకార్యాలకు హాజరు కావడం వంటివన్నీ త్యాగం చేసి ఉద్యోగానికే అంకితమయ్యానని వివరించాడు. మూడేళ్ల తర్వాత తనకు ప్రమోషన్ వచ్చిందని, రూ.7.8 కోట్ల వార్షిక వేతనం అందుకోబోతున్నానని తెలిపాడు. అయితే, భార్య తనతో కలిసి ఉండేందుకు ఇష్టపడడంలేదని, విడాకులు కోరుతోందని చెప్పాడు. ఏ ప్రమోషన్ కోసం అయితే, మూడేళ్లు కష్టపడ్డానో అదే తన వ్యక్తిగత జీవితంలో మంట పెట్టిందని వాపోతున్నాడు. ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. నా జీవితంలో నేను ఏమి చేస్తున్నానో అని నన్ను నేను ప్రశ్నించుకోకుండా ఉండలేకపోతున్నాను. కానీ ఈ లేఆఫ్ తుఫాన్ యుగంలో, నా దగ్గర ఉన్నదానితో నేను సంతోషంగా ఉండాలి కదా? కానీ సంతోషంగా ఎలా ఉండాలి?" అని అతను అడిగాడు.