Ed Sheeran Surprise With Devara Song (Credits: X)

Hyderabad, Feb 10: బ్రిటిష్ పాప్ సింగర్ ఎడ్వర్డ్ క్రిస్టోఫర్ షీరాన్‌ (Ed Sheeran Surprise With Devara Song) కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆయన రాకతో 'దేవర' (Devara) హ్యాష్‌ ట్యాగ్‌ ట్విటర్‌ లో ట్రెండ్‌ అవుతుంది. ఎందుకో తెలుసా? బెంగళూరులో తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో షీరాన్‌ దేవర సినిమాలోని 'చుట్టమల్లే' పాట పాడారు. ఒరిజినల్ వెర్షన్ ను ఆలపించిన గాయని శిల్పారావుతో కలిసి ఈ కన్సర్ట్ లో ఆయన వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా 'చుట్టమల్లే' పాటను పాడి ఫ్యాన్స్ ను అలరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

ప్రజారాజ్యం పార్టీనే జనసేన పార్టీగా రూపాంతరం చెందింది.. మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు (వీడియో)

Here's Video:

సీక్వెల్ షురూ అప్పుడే..

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్‌ తో గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 10 ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది (వీడియో)