Chiranjeevi (Credits: X)

Vijayawada, Feb 10: తాను స్థాపించిన ప్రజారాజ్యం (Praja Rajyam Party) పార్టీనే ఇప్పుడు జనసేన పార్టీగా (Janasena) రూపాంతరం చెందిందని మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కీలక వ్యాఖ్యలు చేశారు. విష్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో వ‌స్తున్న తాజా చిత్రం 'లైలా'. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నాడు హైదరాబాద్ లో జ‌రిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చాలా రోజుల త‌ర్వాత‌ తాను స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. చిరు మాట్లాడుతున్న స‌మ‌యంలో ఫ్యాన్స్ 'జై జ‌న‌సేన' అంటూ నినాదాలు చేయ‌డంతో ఆయ‌న కూడా 'జై జ‌న‌సేన' అని తొలిసారిగా అన్నారు. ఇంకా చిరు మాట్లాడుతూ.. నాటి ప్ర‌జారాజ్యం పార్టీనే రూపాంత‌రం చెంది, జ‌న‌సేన‌గా మారిందంటూ చెప్పుకొచ్చారు. దీంతో చిరు వ్యాఖ్య‌ల‌పై మెగాభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 10 ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది (వీడియో)

Here's Video:

ప్ర‌జారాజ్యం పార్టీ ఇలా..

2008లో చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీ.. ఆ మ‌రుస‌టి ఏడాది జ‌రిగిన ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 294 స్థానాల్లో పోటీ చేసి, 18 చోట్ల గెలిచింది. ఆ పార్టీకి 16.32 శాతం ఓట్లు ద‌క్కాయి. అలాగే చిరు రెండు స్థానాలు పాల‌కొల్లు, తిరుప‌తి నుంచి పోటీ చేశారు. తిరుప‌తి నుంచి ఆయ‌న గెలుపొందారు. 2011లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌జారాజ్యం పార్టీ ప్ర‌స్తావ‌న అప్పుడ‌ప్పుడు ప‌వ‌న్ తీసుకువ‌చ్చారు త‌ప్పితే, చిరంజీవి ఎక్క‌డ మాట్లాడ‌లేదు. కాగా 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాన్ స్థాపించిన జనసేన ఇటీవలి ఏపీ ఎన్నికల్లో పోటీచేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించడం తెలిసిందే.

అమరావతి కోసం కలలు కనడం తప్పా మీరు చేసింది ఏమిటీ ? సీఎం చంద్రబాబుపై విరుచుకుపడిన కురసాల కన్నబాబు