Kurasala Kannababu Slams CM Chandrababu (Photo-FB)

Vjy, Feb 9: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార మార్పిడి రాజకీయాల్లో సహజమని.. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు స్టేట్‌మెంట్ ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. గతం చంద్రబాబుకు గుర్తుకు రాదా?.. కేజ్రీవాల్ ఓడిపోగానే చంద్రబాబు కొత్త పల్లవి, కొత్త కీర్తనలు పాడటం మొదలు పెట్టాడంటూ కన్నబాబు (Kurasala Kannababu Slams CM Chandrababu) దుయ్యబట్టారు.

మోదీ రైట్ టైం రైట్ లీడర్ షిప్ అని మోదీని చంద్రబాబు ఎప్పుడు గుర్తించారు. చంద్రబాబే పెద్ద దిక్సూచి అని గతంలో కేజ్రీవాల్ కీర్తించారు. మోదీ సరైనా నాయకుడు కాదని 2017, 18, 19లో చెప్పింది చంద్రబాబే అని అన్నారు. మోదీ డిక్టేటర్ అని.. అలాంటి మోదీని తలదన్నుతున్నాని చంద్రబాబు చెప్పాడు. అవినీతి కుడితిలో మోదీ పడి విలవిల లాడుతున్నాడని చంద్రబాబు అన్నారు. మోదీ మీద చంద్రబాబు చేసి‌న వాఖ్యలన్ని రికార్డ్ కాబడినవే’’ అని కన్నబాబు గుర్తు చేశారు.

వీడియో ఇదిగో, ఎమ్మెల్యే కొలికపూడి వేధింపులు తట్టుకోలేక టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం, ప్రస్తుతం చావు బతుకుల్లో..

మోదీని నమ్మి మోసపోయామని చంద్రబాబు అన్నారు. మోదీ హటావో.. దేశ్ బచావో అని ఐదేళ్ల క్రిందట విమర్శించారు. రాజకీయ అవసరాల కోసం ఊసరవెల్లిని మించిపోతారు. చంద్రబాబు. చంద్రబాబుకు మద్దతు ఇచ్చే మీడియా ఉంది‌. అందుకే ఆయన ఆటలు సాగుతున్నాయి. సంక్షేమ ఇస్తున్నామని బటన్ నొక్కితే ప్రజలు విశ్వసించడం లేదని చంద్రబాబు చెప్పారు.

సంపద సృష్టితో సంక్షేమం ఇవ్వాలని చెప్పారు. ఏపీ, ఢిల్లీలో ఉచితాలు ఫెల్యూర్ అయ్యాయని అన్నారు. ఉచితాలు ఫెల్యూర్ అయితే.. సూపర్ సిక్స్ ఇస్తానని ఏ రకమైన హమీలు చంద్రబాబు ఇచ్చారు. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అని విధంగా చంద్రబాబు తీరు ఉంది’’ అని కన్నబాబు దుయ్యబట్టారు.

సంక్షేమం ముఖ్యం కాదు రాష్ట్ర గ్రోత్‌ను పెంచడం అని తనకి నచ్చినట్లు పాలన చేస్తానని చెబుతున్నాడు. సంక్షేమం తన ప్రాముఖ్యత కాదని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎందుకు చెప్పలేదు? పచ్చిగా తన హామీలను తుంగలోకి తొక్కడానికి చంద్రబాబు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నాడు. ప్రజల మైండ్‌ను సెట్ చేస్తున్నాడు. ఆడిన ఆబద్ధం ఆడకుండా. ఎంత కాలం విశ్వసనీయత లేకుండా పాలన చేస్తారు.

సంపద సృష్టి కర్త ఈ ఎనిమిది నెలలో ఏం చేశారు?. ఎవరి కోసం సంపద సృష్టి చేశారు. తన వాళ్లు.. పార్టీ నాయకుల కోసం చంద్రబాబు సంపద సృష్టిస్తున్నారు. పేకాట క్లబ్‌ల కోసం కూటమి నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయి. చివరికి బూడిద కోసం కూడా కూటమి నేతల మధ్య గొడవలు జరిగాయి.

విద్యుత్ ఛార్జీలు రూ.15 వేల‌కోట్లు సంపద సృష్టి అనుకోవాలా?. ఉచిత ఇసుక ద్వారా ఎవరేవరికి సంపద సృష్టి జరుగుతుందో తెలుసుకోండి. చంద్రబాబు ఎప్పటికప్పుడు మనస్సు మార్చుకుంటారా?. కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ ఏమైంది?. 2019లో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించారు. దానికి కట్టుబడి ముందుకు వెళ్తారా?. విభజన చట్టంలో హమీలు ఎంత వరకు వచ్చాయి?. ప్రజల ఎకౌంట్‌లో డబ్బులు వేయనని చంద్రబాబు చెబుతున్నట్లు ఉంది.

కొన్ని పెద్ద శాఖలకు ఎక్కువ ఫైల్స్ వస్తాయి. అలాగే చిన్న శాఖలకు తక్కువ ఫైల్స్ వస్తాయి. మంత్రుల ర్యాంకుల విషయంలో అందరిని ఒక గాడిన పెట్టడం సరికాదు. ఆర్థిక శాఖకు 24 ఇచ్చారంటా.. మీ పాలనలో ఆర్థిక పరిస్థితి బాగోలేదనేగా?. ర్యాంకుల కోసం కూటమి నేతల మధ్య విబేధాల నెలకొన్నాయి. మీ ర్యాంకులకు పాస్ మార్కులు కూడా రాలేదు. అమరావతి కోసం కలలు కనడం తప్పా... మీరు చేసింది ఏమిటీ?. చంద్రన్న పగ.. చంద్రన్న దగా ఈ రాష్ట్రంలో అమలు అవుతున్నాయి’’ కన్నబాబు దుయ్యబట్టారు.