IPL Auction 2025 Live

Telugu Flag Tweet Row: నాటు నాటు సాంగ్.. సీఎం జగన్ తెలుగు ఫ్లాగ్ ట్వీట్‌పై అద్నాన్ సమీ విమర్శలు, మధ్యలో నీకేంటి నొప్పి అంటూ విరుచుకుపడుతున్న నెటిజన్లు

ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు ('Naatu Naatu' Wins Oscar) వచ్చిన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. అయితే ఆయన చేసిన ట్వీట్ పై గాయకుడు అద్నాన్ సమీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు

Adnan Sami and YS Jagan (Photo-File Image)

Adnan Sami Slams Andhra CM Jagan: గాయకుడు అద్నాన్ సమీ మళ్లీ జగన్ పై విమర్శలు చేశారు. ఆర్ఆర్ఆర్ లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు ('Naatu Naatu' Wins Oscar) వచ్చిన సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. అయితే ఆయన చేసిన ట్వీట్ పై గాయకుడు అద్నాన్ సమీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఖ్యాతి రెపరెపలాడుతోందన్న జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.

‘బావిలోని కప్ప మనస్తత్వం’ అంటూ సమీ ఆరోపణలు చేశారు. ‘‘సముద్రం గురించి ఆలోచించలేని, ప్రాంతీయ మనస్తత్వం ఉన్న చెరువులో కప్ప (regional-minded frog)!! ప్రాంతీయ విభజనలను సృష్టిస్తున్నందుకు, దేశానికి దక్కిన గౌరవాన్ని అందుకోలేకపోతున్నందుకు సిగ్గుపడు. జై హింద్!!’’ అంటూ గాయకుడు ట్వీట్ చేశారు.

తెలుగు ఫ్లాగ్ అంటే తెలుగు జాతి, ముందు తెలుగోడి సత్తా తెలుసుకుని మాట్లాడు, ఆద్నాన్ సమీపై విరుచుకుపడిన వైసీపీ మంత్రులు

దీంతో అద్నాన్ సమీపై (Adnan Sami) తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై విమర్శలు చేయడం మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. హద్దులు తెలుసుకుని మాట్లాడాలని సూచిస్తున్నారు. ‘‘ఒక తెలుగు పాట అవార్డు దక్కించుకుంది. ఓ తెలుగు వ్యక్తి గర్వపడ్డాడు. ఇందులో అవమానించడానికి ఏముంది? మధ్యలో నీకేంటి నొప్పి?’’ అని ప్రశ్నిస్తున్నారు.

Here's Adnan Sami Tweets

‘‘అసలు ఏంటి నీ సమస్య? భారత్ గురించి నీకు ఏం తెలుసు? భారత పౌరసత్వం పొందినంత మాత్రాన.. మమ్మల్ని ఆదేశించేంత అధికారం నీకు వచ్చిందని అనుకుంటున్నావా? ఇండియా అంటే రాష్ట్రాల కలయిక. ఆయన (జగన్) ది భాషాభిమానం.. విభజన కాదు’’ అని ఓ యూజర్ ఘాటుగా సమీకి వార్నింగ్ ఇచ్చారు.

తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కించుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేసిన ఏపీ సీఎం జగన్

నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శల వస్తున్న నేపథ్యంలో అద్నాన్ సమీ మరో ట్వీట్ చేశారు. ఒక భాషను అగౌరవపరచడం తన ఉద్దేశం కాదని చెప్పారు. ‘‘నేను మాట్లాడేది భాష గురించి కాదు. నా ఉద్దేశం చాలా సింపుల్.. ‘ఇండియన్ ఫస్ట్’ అనే గొడుగు కిందికే అన్ని భాషలు వస్తాయి. భారతీయత తర్వాతే ఏదైనా. అంతే. నేను కూడా ప్రాంతీయ భాషల్లో ఎన్నో పాటలు పాడాను. అన్నింటినీ ఒకే విధమైన కృషితో, అన్ని భాషలపై సమానమైన గౌరవంతో పాడాను’’ అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.



సంబంధిత వార్తలు

IND vs AUS 1st Test 2024: పెర్త్‌ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై భారీ గెలుపు, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో నంబర్‌ వన్‌ స్థానానికి భారత్, రెండో స్థానానికి కంగారూలు

Ambati Rambabu: అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయరా ? పోలీసులకు సూటి ప్రశ్న విసిరిన వైసీపీ నేత అంబటి రాంబాబు

No Pharma City In Kodangal: కొడంగ‌ల్ భూసేక‌ర‌ణ విష‌యంలో వెన‌క్కు త‌గ్గిన సీఎం రేవంత్ రెడ్డి, అక్క‌డ‌ వ‌చ్చేది ఫార్మా సిటీ కాదు, ఇండ‌స్ట్రీయ‌ల్ పార్క్ మాత్ర‌మే

Eknath Shinde: మహారాష్ట్ర సీఎం పదవిపై ఫిటింగ్ పెట్టిన ఏక్‌నాథ్ షిండే...సీట్లకు సీఎం పదవికి సంబంధం లేదని కామెంట్, ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్లే సీఎం కావాలని లేదని వెల్లడి