Adnan Sami and YS Jagan (Photo-File Image)

VJY, Jan 13: RRR నాటు నాటు సాంగ్ కు గోల్డన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సందర్భంగా సీఎం జగన్ అంతర్జాతీయ వేదికపై తెలుగు జెండాను రెపరెపలాడించారని ప్రశంసించిన విషయం విదితమే. తెలుగువాడికి ఇది గర్వకారణమని, మూవీ యూనిట్‌ను చూసి తాము గర్వపడుతున్నామని ట్వీట్ చేశారు. దీనిపై ప్రముఖ హిందీ సింగర్ అద్నాన్ సమీ సంచలన ట్వీట్ చేశారు.

సీఎం చేసిన ట్వీట్‌లో తెలుగు జెండాను ఉద్దేశించి సింగర్‌ అద్నాన్‌ సమీ ట్వీట్‌ చేశారు. జగన్‌ ట్వీట్‌ను ఉటంకిస్తూ.. ‘తెలుగు జెండానా? మీ ఉద్దేశం ఇండియన్‌ జెండా అనా? ముందు మనం ఇండియన్స్‌. కాబట్టి దేశం నుంచి మీకు మీరు వేరుచేసుకోవడం మానుకోండి. ముఖ్యంగా అంతర్జాతీయంగా మనమంతా ఒక దేశం. వేర్పాటువాద ధోరణి అనేది అస్సలు మంచిది కాదు. దీన్ని 1947లో మనం చూశాం. ధన్యవాదాలు.. జై హింద్’’ అని ట్వీట్ చేశారు.

తెలుగు జెండా పైకి ఎగిరి రెపరెపలాడుతోంది, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కించుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి అభినందనలు తెలియజేసిన ఏపీ సీఎం జగన్

అద్నాన్‌ సమీ చేసిన ట్వీట్‌కు ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు కౌంటర్‌ ఇచ్చారు. అద్నాన్‌ చేసిన ట్వీట్‌కు స్పందించిన ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కౌంటర్‌ ట్వీట్ చేశాడు. ‘మా భాష, మా సంస్కృతి, మా గుర్తింపు మాకు గర్వకారణం. నేను మళ్లీ చెబుతున్నాను, మేం తెలుగు వాళ్లం. మా దేశభక్తిని ప్రశ్నించడానికి మీరు ఎవరు.? తెలుగులో ఉన్న నా గౌరవం ఒక భారతీయుడిగా నా గుర్తింపును తీసుకుపోదు’ అంటూ ట్వీట్‌ చేశారు.

Here's CM Jagan Tweet

Here's Adnan Sami Tweet

Here's YCP Ministers Tweet

అద్నాన్‌ సమీ చేసిన ట్వీట్‌పై మరో మంత్రి విడుదల రజని కూడా స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. ‘ఒకరి సొంత గుర్తింపులో గర్వపడటం వారి దేశ భక్తిని తగ్గిచందు. ఒకరి మూలాన్ని గౌరవించడం వేర్పాటు వాదాన్ని ప్రకటించడం కాదు. రెండింటినీ కన్ఫ్యూజ్‌ చేయకూడదు. ట్విట్టర్‌లో అతిగా ఆలోచించడం కంటే ఇండియాకు మరో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు సాధించడంలో కృషి చేస్తే బాగుంటుంది’ అంటూ రీకౌంటర్‌ ఇచ్చారు.

కుంభస్థలాన్ని కొట్టిన RRR మూవీ, అంతర్జాతీయ అవార్డు దక్కించుకున్న జక్కన్న మూవీ, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

తెలుగుజాతిలోనే దేశభక్తి ఉంటుంది. తెలుగు జెండా రెఫరెన్స్ ఎందుకంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెల్చుకుంది నాటునాటు..నాచోనాచో కాదు. 2016కి ముందు అద్నాన్ సమీ భారతీయ పౌరుడు కానందున స్పష్టమైన జ్ఞానం లేదని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

ట్రిపుల్ ఆర్ సినిమాతో తెలుగువారికి సంబంధం ఉండటంతో సీఎం జగన్‌ ట్వీట్‌ ఆనందంగా ఉంది. భారతదేశంపై తమ ప్రేమను అడ్డుకోలేరు-మీరు మాకు దేశభక్తిని నేర్పించాల్సిన అవసరం లేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాజీవ్ కృష్ణ మండిపడ్డారు.