Nawazuddin Siddiqui: భార్య, పిల్లలను ఇంటి నుంచి గెంటేసిన బాలీవుడ్ యాక్టర్, రూ.81తో ఎలా బ్రతకాలంటూ నటుడి భార్య ఏడుపు, సోషల్ మీడియాలో భర్త నిర్వాకాన్ని పోస్టు చేసిన భార్య
వ్యక్తిగతంగా మాత్రం కొంత కాలంగా వివాదాలతో హాట్ టాపిక్ అవుతున్నాడు. నవాజుద్దీన్ భార్య అలియా ఇప్పటికే ఎన్నో సార్లు తన భర్త మీద ఆరోపణలు చేసింది. పెళ్లయిన దగ్గర నుంచి తనను వేధిస్తున్నాడని, బలవంతంగా అనుభవిస్తున్నాడని ఇటీవలే మీడియా ముందు చెప్పింది. ఆ వార్తలు బాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపాయి.
Mumbai, March 03: నటుడిగా తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్న నవాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui).. వ్యక్తిగతంగా మాత్రం కొంత కాలంగా వివాదాలతో హాట్ టాపిక్ అవుతున్నాడు. నవాజుద్దీన్ భార్య అలియా ఇప్పటికే ఎన్నో సార్లు తన భర్త మీద ఆరోపణలు చేసింది. పెళ్లయిన దగ్గర నుంచి తనను వేధిస్తున్నాడని, బలవంతంగా అనుభవిస్తున్నాడని ఇటీవలే మీడియా ముందు చెప్పింది. ఆ వార్తలు బాలీవుడ్‌లో పెద్ద దుమారమే రేపాయి. కాగా తాజాగా నవాజుద్దీన్ తనను, తన పిల్లలను బయటకు గెంటేశాడంటూ (thrown her and children out) ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
గార్డులను పెట్టి బలవంతంగా నవాజుద్దీన్ బయటకు పంపేశాడని ఆలియా అవేదన వ్యక్తం చేసింది. నా దగ్గర రూ.81 ఉన్నాయి. ఇద్దరు పిల్లలతో ఎక్కడికి వెళ్లాలో తెలియట్లేదు. నవాజ్ (Nawazuddin Siddiqui) ఇలా చేస్తాడని అనుకోలేదు. కన్నతండ్రి ఇలా చేయడాన్ని కుతురు ఊహించుకోలేకపోతుంది. నిన్ను వదలను.. నన్ను, నా పిల్లలని రోడ్డు మీద పడేశావు. నేను నిన్ను ఖచ్చితంగా వదలను అంటూ వీడియోలో వెల్లడించింది. ఆ వీడియోలో నవాజ్ కూతురు ఇంటివైపు చూస్తే ఏడవడం అందరినీ కలిచి వేస్తుంది. కాగా దీనిపై ఇంకా నవాజుద్దీన్ స్పందించలేదు.