Oscar Awards 2024: అట్టహాసంగా ఆస్కార్ వేడుకలు.. పురస్కారాల్లో ఓపెన్ హైమర్ సినిమా సందడి.. ఉత్తమ చిత్రంగా ఎంపిక, ఉత్తమ నటుడుగా కిలియన్ మర్ఫీ (ఓపెన్ హైమర్), ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్), ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్ హైమర్).. విజేతల పూర్తి వివరాలు ఇవిగో..
అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం కొనసాగుతోంది.
Newyork, Mar 11: సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే ఆస్కార్ (Oscar Awards 2024) అవార్డుల వేడుక అట్టహాసంగా సాగుతున్నది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డాల్బీ థియేటర్ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం కొనసాగుతోంది. ఈ వేడుకల్లో ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ 'ఓపెన్ హైమర్' (Oppenheimer) సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడితో సహా పలు అవార్డులను సొంతం చేసుకుంది. విజేతల పూర్తి వివరాలు ఇవిగో..
Oscars 2024 Winners: బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న ది బాయ్ అండ్ ది హెరాన్
అవార్డులు ఇవిగో..
- ఉత్తమ చిత్రం: (ఓపెన్‌హైమర్)
- ఉత్తమ నటుడు: కిలియన్ మర్ఫీ (ఓపెన్‌హైమర్)
- ఉత్తమ నటి: ఎమ్మా స్టోన్ (పూర్ థింగ్స్)
- ఉత్తమ దర్శకుడు : క్రిస్టోఫర్ నోలన్ (ఓపెన్‌హైమర్)
- ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్ డౌనీ జూనియర్ (ఓపెన్‌హైమర్)
- ఉత్తమ సహాయ నటి: డేవైన్ జో రాండాల్ఫ్ (ది హోల్డోవర్స్)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ:ఓపెన్‌హైమర్
- ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: 20 డేస్ ఇన్ మరియోపోల్
- బెస్ట్ హెయిర్ స్టయిల్ అండ్ మేకప్:నడియా స్టేసీ, మార్క్ కౌలియర్ (పూర్ థింగ్స్)
- బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: కార్డ్ జెఫర్‌పన్ (అమెరికన్ ఫిక్షన్)
- బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: జస్టిన్ ట్రైట్, అర్థర్ హరారీ (అనాటమీ ఆఫ్ ఎ ఫాల్)
- బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: ది బాయ్ అండ్ ది హిరాన్
- ఉత్తమ కాస్టూమ్ డిజైన్: హోలి వెడ్డింగ్‌టన్ (పూర్ థింగ్స్)
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: జేమ్స్ ప్రైస్, షోనా హెత్ (పూర్ థింగ్స్)
- ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్: ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
- ఉత్తమ ఎడిటింగ్: జెన్నిఫర్ లేమ్ (ఓపెన్‌హైమర్)
- ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: గాడ్జిల్లా మైనస్ వన్
- ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్): ది లాస్ట్ రిపేర్ షాప్
- ఉత్తమ ఒరిజినల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఓపెన్‌హైమర్
- ఉత్తమ సౌండ్ : ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్
- లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ది వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ సుగర్
- ఉత్తమ ఒరిజినల్ సాంగ్: వాట్ వాస్ ఐ మేడ్ ఫర్ ( బార్బీ)