Director Bala: భార్యతో విడాకులు తీసుకున్న మరో స్టార్ డైరక్టర్, 18 ఏళ్ల వివాహ బంధానికి గుడ్ బై చెప్పిన కోలీవుడ్‌ దర్శకుడు బాలా, మధుమలార్‌తో లీగల్‌గా విడిపోయినట్లు ప్రకటన

తాజాగా మరో స్టార్‌ డైరెక్టర్‌ భార్యతో లీగల్‌గా విడిపోయినట్లు ప్రకటించారు. కోలీవుడ్‌ దర్శకుడు బాలా తన భార్య మధుమలార్‌కు డివోర్స్‌ ఇచ్చాడు.

Pithamagan Director Bala And Muthumalar Get Divorced After 18 Years Of Marriage (Photo-Twitter)

ఇప్పటికే సమంత, ధనుష్‌, అమీర్‌ ఖాన్‌తో పాటు పలువురు సీనీ ప్రముఖులు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకివ్వగా.. తాజాగా మరో స్టార్‌ డైరెక్టర్‌ భార్యతో లీగల్‌గా విడిపోయినట్లు ప్రకటించారు. కోలీవుడ్‌ దర్శకుడు బాలా తన భార్య మధుమలార్‌కు డివోర్స్‌ ఇచ్చాడు. దాదాపు 18 ఏళ్ల పాటు సాగిన వీరి వివాహ బంధానికి నేటితో తెరపడింది. గత నాలుగేళ్లుగా బాల, మధుమలార్‌ విడి విడిగా ఉంటున్నారు. మ్యూచువల్ విడాకులకు అప్లై చేసిన ఈ జంటకు తాజగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. వీరికి ఒక కూతురు ఉంది.

ఇక దర్శకుడి బాల.. తమిళ్‌లోనే కాకుండా తెలుగులోనూ సుపరిచితుడు. ఆయన దర్శకత్వం వహించిన శివపుత్రుడు, శేషు, వాడు- వీడు చిత్రాలు తెలుగులో కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. అలాగే 2008లో బాల 'నాన్ కాదవుల్' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif