Prabhas Recreates Chiranjeevi Scene: చిరంజీవికి వినూత్నంగా విషెస్ చెప్పిన ప్రభాస్, చిరూలీక్స్ స్పూర్తితో అంటూ గ్యాంగ్‌లీడర్ సీన్ రీక్రియేషన్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
చిరంజీవి గ్యాంగ్‌లీడర్ సినిమాలోని ఓ సీన్‌ను రీక్రియేట్ చేశాడు ప్రభాస్. మా హృదయాలు, కల్కి 2898 ఏడీ ఎడిటింగ్ రూం నుంచి మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. #ChiruLeaks స్ఫూర్తితో అంటూ వైజయంతీ మూవీస్ బ్యానర్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
Hyderabad, AUG 22: మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు సందర్భంగా మూవీ లవర్స్, అభిమానులు, ఫాలోవర్లు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) చిరుకు స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పింది. చిరంజీవి గ్యాంగ్‌లీడర్ సినిమాలోని ఓ సీన్‌ను రీక్రియేట్ చేశాడు ప్రభాస్. మా హృదయాలు, కల్కి 2898 ఏడీ ఎడిటింగ్ రూం నుంచి మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. #ChiruLeaks స్ఫూర్తితో అంటూ వైజయంతీ మూవీస్ బ్యానర్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి సైన్స్ ఫిక్షన్ జోనర్‌లో వస్తోన్న చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మూవీ లవర్స్, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మూవీ టైటిల్, గ్లింప్స్ వీడియోను ఇటీవలే విడుదల చేయగా.. నెట్టింట వ్యూస్ పంట పండిస్తూ టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలుస్తోంది. కల్కి 2898 ఏడీ హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో విజువల్స్ చెబుతున్నాయి.
సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ కపుల్‌హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ (Gold Box Entertainments) చిరంజీవికి విషెస్ అందిస్తూ.. Mega 156 అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవి మరోవైపు
బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో MEGA 157 చేస్తున్నాడని తెలిసిందే. సోషియా ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని లీడింగ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. బర్త్ డే సందర్భంగా లాంఛ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.