Radhe Shyam Song Aashiqui Aa Gayi Out: రాధేశ్యామ్ నుంచి క్రేజీ అప్డేట్, ఆషికీ ఆగయా సాంగ్‌కు ఫ్యాన్స్ ఫిదా, మెస్మరైజ్ చేసిన ప్రభాస్ లుక్స్, అర్జీత్ వాయిస్
ఈ మూవికి సంబంధించిన ఆషికీ ఆగయా(Aashiqui Aa Gayi) అంటూ సాగే హిందీ సాంగ్‌ను రిలీజ్ చేసింది. కొద్దిరోజుల క్రితం రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఫ్యాన్స్ అంతా చాలా వెయిట్ చేశారు.
Mumbai December 01: ప్రభాస్(Prabhas) ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్(Radhe Shyam) మూవీ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవికి సంబంధించిన ఆషికీ ఆగయా(Aashiqui Aa Gayi) అంటూ సాగే హిందీ సాంగ్‌ను రిలీజ్ చేసింది. కొద్దిరోజుల క్రితం రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. దీంతో ఫ్యాన్స్ అంతా చాలా వెయిట్ చేశారు.
జనవరి 14న విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్రమోషన్స్ సాగుతున్నాయి. బీచ్‌లో లైట్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉన్న డ్రెస్‌లో ప్రభాస్(Prabhas), పూజా హెగ్డే(Pooja Hegde) మధ్య రొమాంటిక్‌గా పాట సాగుతుంది. ఈ పాటలో విజువల్స్ కలర్ఫుల్గా, బ్యూటీపుల్‌గా ఉన్నాయి. ప్రభాస్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ ప్రేమికులను మెస్మరైజ్ చేస్తుందనడంలో సందేహం లేదనిపిస్తుంది.
ఆషికీ-2(Aashiqui-2) మూవీకి మ్యూజిక్ చేసిన టీమ్ ఈ సాంగ్‌ను కంపోజ్ చేసింది. తుమ్ హీ హో సాంగ్‌తో పాపులర్ అయిన అర్జీత్ సింగ్(Arjith Singh) ఆషికీ ఆగయా సాంగ్ పాడారు. దీంతో మరింత హైప్ క్రియేట్ అయింది. అనుకున్నట్లుగానే ఈ సాంగ్ రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇందులో ఎదుటివారి చేతి రేఖలను చూసి వారి భవిష్యత్తును చెప్పగల నేర్పరి అయిన హీరో.. తన ప్రేయసి చేతి రేఖలను చూసి ఆమె ప్రమాదాలను పసిగడతాడు. ఆమెను ఆ ప్రమాదాల బారి నుంచి ఎలా రక్షించుకున్నాడనేదే సినిమా అని తెలుస్తుంది.
యువీ క్రియేషన్స్(UV Creations), టీ సిరీస్(T series) సంస్థలపై మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద, ప్రశీద ఈ చిత్రాన్ని రూపొందించారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్(Radha Krishna) సినిమాను డైరెక్ట్ చేశారు.