Ram Charan: భారత సినీ పరిశ్రమలో ఎవరికీ దక్కని ఘనత సాధించిన రామ్ చరణ్, తొలిసారి ఓ భారతీయ నటుడికి దక్కనున్న ప్రతిష్టాత్మక అవార్డు
ఐఎఫ్ఎఫ్ఎమ్ అనేది విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే అధికారిక చలనచిత్రోత్సవం. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 25 వరకు జరగనుంది.
Hyderabad, July 19: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌కి (Golbal Star Ram Charan) అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (IFFM) 15వ ఎడిషన్‌కు రామ్ చరణ్‌ని గౌరవ అతిథిగా ప్రకటించింది. ఈ వేడకకు రామ్‌చరణ్ అతిథిగా వెళ్లడమే కాదు భారతీయ సినిమాకి చేసిన సేవలకు గాను ను ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్ (Ambassador) అవార్డును సైతం ఆయన అందుకోనున్నారు. ఈ విషయాన్ని ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
మీ అందరికి ఓ శుభవార్త. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ 2024కి గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ వస్తున్నారు. నాటు నాటుకు డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది. దీనిపై మెగాపవర్ స్టార్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ వేడుకలో తాను ఓ భాగం అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ (RRR) విజయం చిన్నది కాదని, విశ్వవ్యాప్తం అని అన్నారు. మెల్‌బోర్న్‌లో ఆడియెన్స్‌ను కలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లుగా చెప్పారు. ఐఎఫ్ఎఫ్ఎమ్ అనేది విక్టోరియన్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహించే అధికారిక చలనచిత్రోత్సవం. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 25 వరకు జరగనుంది.