RRR Creates Records in Japan: జపాన్‌లో RRR మూవీకి కాసుల పంట, బిగ్గెస్ట్ గ్రాసర్‌గా రికార్డు సొంతం చేసుకున్న మూవీ, జపాన్‌లో ఎంత వసూలు చేసిందంటే?

ఈ సినిమా ఇంకా అక్కడ స్ట్రాంగ్ రన్‌తో దూసుకెళ్తోంది. కాగా, తాజాగా ఈ సినిమా ఏకంగా 505 మిలియన్ యిన్స్ సాధించినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ఈ ఫీట్‌ను 80 రోజుల్లోనే సాధించడం విశేషమని చెప్పాలి. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలవడంతో, ఈ సినిమాకు ఎన్ని అవార్డులు దక్కుతాయా అని అందరి చూపులు ఈ సినిమాపై ఉన్నాయి.

RRR (Photo Credits: Twitter)

Tokyo, JAN 11: టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి డైరెక్ట్ చేయగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr. NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈ సినిమాలో నటించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లోనూ సత్తా చాటుతూ అందరినీ ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను రీసెంట్‌గా జపాన్ (Japan) దేశంలో అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ చేశారు. ఈ సినిమాకు జపాన్‌లోనూ ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ మూవీ జపాన్‌లో రిలీజ్ అయ్యి ఆ దేశంలో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా రికార్డు (Biggest Grocer) సెట్ చేసింది. ఈ సినిమాకు జపాన్ వాసులు ఫిదా కావడంతో వసూళ్ల వర్షం కురిసింది.

Golden Globe Award for Naatu Naatu Song: కుంభస్థలాన్ని కొట్టిన RRR మూవీ, అంతర్జాతీయ అవార్డు దక్కించుకున్న జక్కన్న మూవీ, ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ 

అయితే ఈ సినిమా ఇంకా అక్కడ స్ట్రాంగ్ రన్‌తో దూసుకెళ్తోంది. కాగా, తాజాగా ఈ సినిమా ఏకంగా 505 మిలియన్ యిన్స్ సాధించినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ఈ ఫీట్‌ను 80 రోజుల్లోనే సాధించడం విశేషమని చెప్పాలి. ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలవడంతో, ఈ సినిమాకు ఎన్ని అవార్డులు దక్కుతాయా అని అందరి చూపులు ఈ సినిమాపై ఉన్నాయి. ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవ్గన్, శ్రియా సరన్‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.

Oscars 2023: ఆస్కార్ బరిలో కాంతారా, ఆర్ఆర్ఆర్, భారత్ నుంచి ఆస్కార్ 2023 రేసులో మొత్తం నాలుగు చిత్రాలు , 301 చలన చిత్రాలతో జాబితాను సిద్ధం చేసిన AMPAS 

ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్నRRR మూవీ...అంతర్జాతీయ అవార్డుల్లోనూ సత్తా చాటుతోంది. ఆస్కార్ నామినేషన్లకు అర్హతసాధించిన మూవీస్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లోనూ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ అవార్డు దక్కించుకుంది. దీంతో తెలుగు సినిమా విశ్వవ్యాప్తంగా ఖ్యాతి దక్కించుకోవడం పట్ల సినీ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement