Swara Bhaskar: సమాజ్ వాదీ పార్టీ యువనేతను లవ్ మ్యారేజి చేసుకున్న బాలీవుడ్ నటి స్వరా భాస్కర్.. వీడియోతో

స్వరా భాస్కర్ ప్రేమించి పెళ్లాడింది ఓ రాజకీయనేతను కావడం విశేషం.

Credits: Twitter

Newdelhi, Feb 17: తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్స్, వీరే ది వెడ్డింగ్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన  నటి స్వరా భాస్కర్ (Swara Bhaskar) తాజాగా ప్రేమ వివాహం చేసుకున్నారు. స్వరా భాస్కర్ ప్రేమించి పెళ్లాడింది ఓ రాజకీయనేతను కావడం విశేషం. అతడి పేరు ఫహద్ అహ్మద్ (Fhad Mohammad). సమాజ్ వాదీ పార్టీ మహారాష్ట్ర విభాగం యూత్ ప్రెసిడెంట్ కాగా, తన పెళ్లి విషయాన్ని స్వరా భాస్కర్ ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

ఆప్ కే ఆజానేసే పాటకు డ్యాన్సుతో దుమ్మురేపిన బాలుడు, డ్యాన్స్ చేస్తూ బాలుడు కింద ప‌డిపోవ‌డంతో చేయి అందించిన తల్లి, వీడియో వైరల్

జనవరి 6న తాము ముంబయిలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నట్టు తెలిపారు. తాము స్నేహితులుగా ప్రస్థానం ప్రారంభించి, ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమలో పడ్డామని ఆమె వివరించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.