Sye Raa Trailer: భారత మాతకి జై! సొంతగడ్డలో పరాయి పాలనపై గర్జించిన 'సైరా నరసింహా రెడ్డి'. స్వేచ్ఛ కోసం జరిగిన మొట్టమొదటి తిరుగుబాటు యుద్ధం ఈ ట్రైలర్‌లో నిక్షిప్తం

గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషలలో సైరా నరసింహా రెడ్డి...

Sye Raa Narasimha Reddy Trailer . | Photo: Konidela Productions.

'ఈ భూమి మీద పుట్టింది మేము, ఈ మట్టిలో కలిసేది మేము, నీకెందుకు కట్టాలిరా శిస్తు' అంటూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో సైరా నరసింహా రెడ్డి ( Sye Raa Trailer) ట్రైలర్ రిలీజైంది. ఈ ఏడాదిలో 'సాహో' తర్వాత టాలీవుడ్ నుంచి విడుదల కాబోతున్న అతిపెద్ద సినిమా 'సైరా'. భారతదేశంలో బ్రిటీష్ పాలనను వ్యతిరేకిస్తూ 1857 సిపాయిల తిరుగుబాటు ఉద్యమానికి కొన్నేళ్ల ముందుగానే తెలుగు నేల వేదికగా జరిగిన తొలి తిరుగుబాటు ఉద్యమాన్ని ఈ సినిమాలో కళ్లకు కట్టనున్నారు. చరిత్రలో కనుమరుగైపోయిన ఓ స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత చరిత్రను మరోసారి ఆవిష్కరించనున్నారు. స్వరాజ్య పాలనను కాంక్షిస్తూ, బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా కత్తిదూసిన ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో నటిస్తున్నారు.

తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళం ఐదు భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. అలాగే ఆయా భాషలకు చెందిన ప్రముఖ నటులు సైరాలో నటిస్తున్నారు. హిందీ నుంచి ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ నుంచి కిచ్చా సుదీప్, తమిళం నుంచి విజయ్ సేతుపతి, నయనతార మొదలుకొని తమన్నా, జగపతి బాబు, రవికిషన్, నిహారిక, నాజర్ ఇలా చెప్పుకుంటూ పోతే భారీ తారాగణం ఈ సినిమాలో ఉంది.

తాజాగా, రిలీజైన సైరా ట్రైలర్ చూస్తే సినిమా నిర్మాణ విలువలు ఎంత భారీగా, ఎంత నాణ్యతతో ఉన్నాయో అర్థమవుతుంది. సైరా సైన్యం చేసే పోరాట దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి.  గ్రెగ్ పావెల్, లీ విట్టేకర్ మరియు రామ్-లక్ష్మణ్ కలిసి 'సైరా' యాక్షన్ సన్నివేశాలను రూపొందించారు. ఇక చిరంజీవి యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

'సైరా' తెలుగు ట్రైలర్ ఇక్కడ చూడండి 

'సైరా'  హిందీ ట్రైలర్ ఇక్కడ చూడండి 

కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై హీరో రామ్ చరణ్ తేజ దాదాపు రూ.270 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో సెప్టెంబర్ 22 నిర్వహించనున్నారు.   గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషలలో సైరా నరసింహా రెడ్డి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif