Sye Raa Trailer 2 - The Battlefield: 'అది మనది.. మన ఆత్మగౌరవం, గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు'. తెల్లోడిపై కత్తిదూసిన సైరా, ట్రైలర్ - 2 రణస్థలం విడుదల

అక్టోబ‌ర్ 2న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌ మరియు మ‌ల‌యాళ భాష‌ల్లో విడుదలవుతుంది....

Sye Raa Trailer2 | Photo- Ram Charan

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి' కి సంబంధించిన రెండవ ట్రైలర్ ను గురువారం విడుదల చేశారు.

ఈ ట్రైలర్ కు 'రణస్థలం' (The Battlefield) అని టైటిల్ పెట్టారు. భారతగడ్డను దోచుకోవడానికి వచ్చిన తెల్లదొరలను తరిమికొట్టేందుకు నరసింహారెడ్డి యుద్ధభూమిలో సైరా అంటూ కత్తిదూసే సన్నివేశాలు ఇందులో చూపించారు.

'బలగాలతో వెళ్లిన మన ఓడలన్నీ, బంగారంతో తిరిగి రావాలి' అంటూ బ్రిటీష్ వారు అంటే, అందుకు నరసింహా రెడ్డి.. అది మనది, మన ఆత్మగౌరవం.. బంగారం కాదు కదా, గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు' అంటూ తన సహచరుల్లో ఉద్యమ స్పూర్థిని రగిలిస్తాడు. భారత గడ్డ మీద పుట్టిన ప్రతి ప్రాణానికి ఉన్న లక్ష్యం ఒక్కటే.. అదే స్వాతంత్య్రం అని స్వరాజ్య కాంక్షను ఎలిగెత్తి చాటిలే సైరా పాత్రలో చిరంజీవి రౌద్రాన్ని ప్రదర్శించారు.

ఆ రెండో ట్రైలర్‌ను మీరూ చూసేయండి.

ఈ సినిమాలో నరసింహా రెడ్డి గురువు, గోశాయ్ వెంకన్న పాత్రలో బాలీవుడ్ షహన్ షా అమితాబ్ బచ్చన్ నటిస్తుండగా, ఝాన్సీ లక్ష్మీభాయి పాత్రలో అనుష్క కనిపించనున్నట్లు సమాచారం. ఇక మిగతా ముఖ్య పాత్రలు వీరా రెడ్డిగా జగపతిబాబు, అవుకు రాజుగా కిచ్చా సుదీప్, రాజా పాండిగా విజయ్ సేతుపతి, సిద్ధమ్మగా నయనతార, మరియు లక్ష్మీ పాత్రలో తమన్నా నటిస్తున్నారు.

'సైరా' ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటుంది . ఈ సినిమాలో సౌత్ మరియు నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన నటులుండటంతో 'పాన్ ఇండియా' సినిమాగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌ మరియు మ‌ల‌యాళ భాష‌ల్లో విడుదలవుతుంది. గాంధీ జయంతి సాక్షిగా అక్టోబర్ 02న సైరా నరసింహా రెడ్డి ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్ స్క్రీన్లపై జాతీయ జెండాను పాతేందుకు వచ్చేస్తున్నాడు.  Sye Raa Trailer 1 భారత మాతకి జై!