#TomAndJerryMovie: టామ్ అండ్ జెర్రీ సినిమా ఇప్పుడు తెలుగులో, ఈ నెల 19న ధియేటర్లలో విడుదల, నవ్వులు తెప్పించే పిల్లి ఎలుక సరదా పోరాటం, దుమ్మురేపుతున్న తెలుగు సినిమా ట్రైలర్
ఈ పేరు కార్టూన్ సినిమాలు చూసేవారికి బాగా సుపరిచితం. ఇప్పుడు తెలుగులో వస్తోంది. టామ్ మరియు జెర్రీ తమ పిల్లి మరియు ఎలుక ఆటను పెద్ద తెరపైకి తీసుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. తెలుగు అభిమానుల కోసం #TomAndJerryMovie ఇప్పుడు తెలుగులో సినిమాగా వస్తోంది. ఫిబ్రవరి 19 న ధీయేటర్లలో రెడీ చేసేందుకు వార్నర్ బ్రదర్స్ రెడీ అయ్యారు.దీనికి సంబంధించిన ట్రైలర్ ను (Telugu trailer) ట్విట్టర్లో విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తోంది.
టామ్ అండ్ జెర్రీ.. ఈ పేరు కార్టూన్ సినిమాలు చూసేవారికి బాగా సుపరిచితం. టామ్ మరియు జెర్రీ తమ పిల్లి మరియు ఎలుక ఆటను తెలుగులో పెద్ద తెరపైకి తీసుకు వచ్చేందుకు సంస్థ రెడీ అవుతోంది. తెలుగు అభిమానుల కోసం #TomAndJerryMovie ని ఫిబ్రవరి 19 న తెలుగులో ధీయేటర్లలో రెడీ చేసేందుకు వార్నర్ బ్రదర్స్ రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన ట్రైలర్ ను (Telugu trailer) ట్విట్టర్లో విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తోంది.
టామ్ అండ్ జెర్రీ అనేది టామ్ అనే పిల్లి, జెర్రీ అనే ఎలుక ప్రధాన పాత్రలుగా (Tom and Jerry) రూపొందించబడిన ఓ యానిమేషన్ కార్యక్రమం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులును సంపాదించుకుంది. విలియమ్ హన్నా.. జోసెఫ్ బార్బెర అనే అమెరికన్ యానిమేటర్లు టామ్ అండ్ జెర్రీని సృష్టించారు. 1940, ఫిబ్రవరి 10న తొమ్మిది నిమిషాల నిడివితో ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. అనతి కాలంలోనే ఇది కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఒక ఇంటి పిల్లి (టామ్) ఎలుక (జెర్రీ) మధ్య అంతులేని శత్రుత్వం ఉంటుంది. అయినా అవి రెండు మిత్రులుగా కొనసాగుతూ ఎత్తుకు పై ఎత్తులతో పోరాటం సాగిస్తుంటాయి.
Here's Warner Bros Tweet
అయితే మొదట్లో వీటికి పేర్లుండేవి కావు. 1941లో వచ్చిన షార్ట్ ఫిల్మ్ ‘ది మిడ్‌నైట్ స్నాక్’లో పిల్లికి జాస్పర్, ఎలుకకి జింక్స్ అని పేరు పెట్టారు. కానీ, పేర్లు క్యాచీగా ఉండాలనే ఉద్దేశంతో హన్నా, బార్బెరలు కొత్త పేర్ల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఆ టైంలో జాన్ కార్ అనే యానిమేటర్ ‘టామ్’, ‘జెర్రీ’ అనే పేర్లు సూచించాడు. ఆ పేర్లు బాగా నచ్చడంతో కార్‌కి యాభై డాలర్ల నజరానా ఇచ్చారు హన్నా, బార్బెరలు. అలా టామ్ అండ్ జెర్రీ షో మొదలైంది.
MGM కార్టూన్ స్టూడియో లో హాలీవుడ్ , కాలిఫోర్నియా నుండి 1940 వరకు 1957 . మొదటి సిరీస్ఇది. ఉత్తమ లఘు చిత్రాలకు (కార్టూన్లు విభాగం ) ఏడుసార్లు అకాడమీ అవార్డులను గెలుచుకున్నది. ఇది వాల్ట్ డిస్నీ థియేట్రికల్ యానిమేటెడ్ సిరీస్ చిలి సింఫొనీతో సమానంగా ఉంది, ఇది కూడా ఎక్కువ ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది.
కార్టూన్లు విభాగంలో ఈ టామ్ అండ్ జెర్రీ చిత్రాలు అకాడమీ అవార్డు (ఆస్కార్) ను గెలుచుకున్నాయి.
1943: యాంకీ డూడుల్ మౌస్
1944: మౌస్ ట్రబుల్
1945: క్వైట్ ప్లీజ్
1946: ది క్యాట్ కాన్సర్టో
1948: ది లిటిల్ అనాథ
1951: ది టూ మస్కటీర్స్
1952: జోహన్ మౌస్