Varma KRKR Target: కాంట్రవర్సీ కింగ్ వర్మ మరో సంచలనం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, ఏపీ రాజకీయాల్లోని ప్రముఖ నేతలందరిపై గురి, ఆ దేవుడే నన్ను వెన్నుపోటు పొడిచాడంటున్న ట్రైలర్

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలను మరోసారి తెరమీదకు తీసుకువస్తున్నారు. ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబించేలా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో తీస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను వర్మ దీపావళి బాణసంచాకు జతగా ఈ రోజు విడుదల చేశారు.

Ramgopal varma kamma-rajyam-lo-kadapa-reddlu-movie-trailer (Photo-Twitter)

Hyderbad, October 27: కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ఏపీ రాజకీయాలను మరోసారి తెరమీదకు తీసుకువస్తున్నారు. ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబించేలా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో తీస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను వర్మ దీపావళి బాణసంచాకు జతగా ఈ రోజు విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో ‘ఆ దేవుడే నన్ను వెన్నుపోటు పొడిచాడు.. ఎవర్ని ఎలా డీల్ చెయ్యాలో నాకు బాగా తెలుసు’ అని ఓ నేత అంటున్నాడు.. ‘నేనూ విజయవాడలోనే ఉంటున్నానన్న విషయం మర్చిపోవద్దని మరోనేత హెచ్చరిస్తున్నాడు. కాగా కులాల పేర్లనే టైటిల్‌గా పెట్టిన వర్మ ఈ చిత్రంలో వివాదాలు సృష్టించడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. దీనిపై ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి రూపొందుతున్న ఈ మూవీ నుంచి దీపావళికి ప్రేక్షకులకు సర్‌‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్టు చెబుతూ గతకొద్ది రోజులుగా సినిమాలోని రకరకాల పోస్టర్స్ వదులుతూ రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో నానా హంగామా చేశారు.

దీపావళి బాంబు అంటూ వర్మ ట్రైలర్ ట్వీట్

ట్రైలర్ విషయానికి వస్తే .. ‘బ్రేకింగ్ న్యూస్.. మూడుసార్లు ముఖ్యమంత్రి చేసిన బాబు పార్టీ చరిత్రలోనే ఎవ్వరూ రుచి చూడనంత ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత కొన్ని చాలా విపరీత పరిస్థితులు ఏర్పడుతున్నాయ్’ అంటూ వర్మ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న మార్పులతో పాటు, భవిష్యత్తులో జరగబోయే పరిణామలకు తన ఊహాలను జోడించి ట్రైలర్ కట్ చేశాడు వర్మ. ఈ ట్రైలర్‌ పొలిటిషియన్స్, జర్నలిస్ట్స్, రౌడీస్, ఫ్యాక్షనిస్ట్స్, పోలీస్ పీపుల్ అండ్ కామన్ పీపుల్‌కి తన తరపున దివాళీ గిఫ్ట్ అని చెప్పాడు. రామ్‌గోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్ ద్వారా దీన్ని విడుద‌ల చేశారు. ర‌విశంక‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జ‌గ‌దీశ్ చీక‌టి సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలకంగా కనిపిస్తున్న ప్రముఖ రాజకీయ నేతలంతా ఈ ట్రయిలర్ లో ఉన్నారు. సరిగ్గా 5 నెలల కిందట జరిగిన ఏపీ ఎన్నికల నేపథ్యంలో సినిమా ఉంటుందనే విషయం ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతుంది.2 నిమిషాల 50 సెకెన్ల ట్రయిలర్ లో చాలా ఏపీ రాజకీయ ముఖ చిత్రాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించారు వర్మ. మరి సినిమా ఎలా ఉంటుందనేది ఇప్పటికైతే సస్పెన్స్.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy Davos Tour Highlights: దావోస్ వేదికగా తెలంగాణకు ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడుల వివరాలు ఇవే, అమెజాన్‌తో పాటు పలు దిగ్గజ సంస్థలు భారీగా పెట్టుబడులు

Los Angeles Wildfires: వీడియోలు ఇవిగో, లాస్ ఏంజెలెస్‌లో మళ్లీ మంటల కార్చిచ్చు, గంటల వ్యవధిలోనే 9 వేల 400 ఎకరాలు కాలి బూడిద, దాదాపు 50వేల మందిని వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు ఆదేశాలు

Hyderabad Woman Murder Case: భార్యను చంపే ముందు వీధి కుక్క మీద ప్రయోగం, మీర్ పేట్ మహిళ హత్య కేసులో సంచలన విషయాలు, పోలీసులు అదుపులో నిందితుడు రిటైర్డ్‌ ఆర్మీ జవాన్‌ గురు మూర్తి

Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ? ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత DGP ద్వారకా తిరుమలరావు, ఇంతకీ ఎవరీ హరీశ్ కుమార్ గుప్తా

Share Now