Indian Idol 12: ఇండియన్ ఐడల్ 12వ సీజన్ విజేతగా పవన్‌దీప్‌ రాజన్‌, అరుణిత కంజిలాల్‌ రన్నరప్‌, ఆరవ స్థానంలో తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ, విజేతకు బహుమతిగా రూ.25 లక్షల నగదు, కారు, ట్రోఫి

సోనీ టీవీ నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ 12వ సీజన్ విజేతగా పవన్‌దీప్‌ రాజన్‌ (Indian Idol 12 winner is Pawandeep Rajan) నిలిచారు. అరుణిత కంజిలాల్‌ (Arunita Kanjilal) రన్నరప్‌గా, తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ (Shanamukhapriya) ఆరోస్థానంలో నిలిచింది.

Pawandeep Rajan (Photo Credits: Instagram)

సోనీ టీవీ నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ 12వ సీజన్ విజేతగా పవన్‌దీప్‌ రాజన్‌ (Indian Idol 12 winner is Pawandeep Rajan) నిలిచారు. అరుణిత కంజిలాల్‌ (Arunita Kanjilal) రన్నరప్‌గా, తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ (Shanamukhapriya) ఆరోస్థానంలో నిలిచింది. ఆదివారం ఏకబిగిన 12 గంటలపాటు సాగిన పాపులర్‌ మ్యూజికల్‌ రియాలిటీ షో ఇండియన్‌ ఐడల్‌-12 తుది పోటీల్లో తన అద్భుత గానంతో ప్రతిభ చూపిన పవన్‌దీప్‌ రాజన్‌ ట్రోఫీతోపాటు రూ.25 లక్షల నగదు బహుమతి, కారు, ట్రోఫిని గెలుచుకొని విజేతగా (Indian Idol 12 Winner) నిలిచాడు. ఎన్నో ఆశలతో ఫైనల్స్‌కు అడుగుపెట్టిన తెలుగు సింగర్‌ షణ్ముఖ ప్రియ టైటిల్‌ వేటలో అవకాశాన్ని చేజార్చుకుంది.

ఫైనల్‌ పోటీ ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేపి ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఫైనల్‌ షో అర్ధరాత్రి వరకు సాగింది. గ్రాండ్‌ ఫినాలేకు ‘షేర్షా’ జంట సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అడ్వాణీ, ఉదిత్‌ నారాయణ్‌, అల్కా యాజ్ఞిక్‌ అతిథులుగా విచ్చేశారు. గ్రాండ్‌ పినాలేలో మొత్తం ఆరుగురు సభ్యులు పాల్గొన్నారు. జావేద్‌ అలీ. మనోజ్‌ ముంతాషిర్‌, మిల్కాసింగ్‌, సుఖ్విందర్‌ సింగ్‌ తదితరులు చీఫ్‌ గెస్టులుగా హాజరయ్యారు.

సార్ పడుకునే ముందు ప్రతిరోజూ దిష్టి తీయడం మర్చిపోకండి, బర్త్ డే బ్లాస్టర్ పేరుతో సర్కారువారి పాట టీజర్ విడుదల, ఇఫ్ టైగర్ టేక్స్ రాబిట్ అనే డైలాగ్‌తో మహేష్ ఎంట్రీ

ఫైనల్ పోటీలో టైటిల్ కోసం ఆరుగురు కంటెస్టెంట్లు పోటీ పడ్డారు. పవన్‌దీప్ రాజన్, అరునితా కంజిలాల్, మహ్మద్ డానిష్, సయ్యాలి కాంబ్లే, నిహాల్ టారో, షణ్ముఖ ప్రియ మధ్య పోటీ ఉత్కంఠగా సాగింది. చివరకు పవన్‌దీప్ రాజన్ టైటిల్ ఎగరేసుకుపోయాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement