Jabardasth: జబర్దస్త్ నటుల దుమారం, షేకింగ్ శేషు బండారం మొత్తం నాకు తెలుసంటూ విరుచుకుపడిన కిర్రాక్ ఆర్పీ, వాడు శ్యాంప్రసాద్ రెడ్డికి తొత్తు..అందుకే అలా తయారయ్యాడని విమర్శలు

ఆర్పీ కి వ్యతిరేకంగా జబర్దస్త్ (Jabardasth) నుంచి రాంప్రసాద్, హైపర్ ఆది, షేకింగ్ శేషు వంటివారు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు అంటూ చెప్పుకొచ్చారు.

Kiraak RP (Photo-Video Grab)

కమెడియన్ కిరాక్ ఆర్పీ (kirrak rp) జబర్దస్త్ షో మీద ఆ మధ్య చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆర్పీ కి వ్యతిరేకంగా జబర్దస్త్ (Jabardasth) నుంచి రాంప్రసాద్, హైపర్ ఆది, షేకింగ్ శేషు వంటివారు ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ నేపథ్యంలో షేకింగ్ శేషు ఆర్పి పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ఓ ప్రొడ్యూసర్ ని మోసం చేసి 20 లక్షలు మోసపోయేలా చేశాడని, ఆయన హోమ్ టూర్ కూడా అబద్ధం అంటూ షేకింగ్ శేషు ఫైర్ అయ్యారు.

తాజాగా కిరాక్ ఆర్పి (Comedian Kiraak RP) మరో ఇంటర్వ్యూలో పాల్గొని షేకింగ్ శేషుని బండ బూతులు తిట్టారు. కిరాక్ ఆర్పి మాట్లాడుతూ.. షేకింగ్ శేషు (Shaking Seshu) బండారం మొత్తం నాకు తెలుసు. నేను ఏ నిర్మాతని మోసం చేయలేదు. ఆయన చెప్పిన దాంట్లో ఏ మాత్రం వాస్తవం లేదు. సినిమా చేద్దాం అనుకున్నది నిజమే.కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత నేను ప్రొడ్యూసర్ ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. ఇక సినిమా మొదలు పెట్టడం మంచిది కాదని ఆపేశాం. అరుణాచలం గారికి స్టోరీ చెప్పాక ఆయన ఓకే చేశారు.అందువల్లే మేం ఆఫీస్ ఓపెన్ చేసాం. అందరం స్టోరీ బాగుందని షూటింగ్ మొదలెడదాం అనుకునేలోపే మా సినిమా ఆగిపోయింది. కానీ దీనిపై షేకింగ్ శేషు తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నాడు.

సుధీర్, రష్మి రిలేషన్‌పై గెటప్ శ్రీను సంచలన వ్యాఖ్యలు, త్వరలోనే సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిపిన కమెడియన్

ఆఫీస్ ఓపెన్ చేసి ఖర్చు ఇంకా పెంచడని శేషు(sheshu) ఆరోపిస్తున్నాడు. మరి ఆఫీస్ ఓపెన్ చేయకపోతే ఎక్కడినుండి వర్క్ స్టార్ట్ చేస్తారు. సినిమా అంటే ఆఫీస్ ఉంటుంది కదా.అంత ఖర్చు చేశాడని శేషు మాట్లాడుతున్నాడు.మరి శేషు గాడి ఇల్లును ఆఫీస్ వర్క్ కోసం ఇవ్వమను. వాళ్ల భార్య ను ఆఫీస్ బాయ్ గా పని చేయమను. వాడిని వచ్చి బోళ్లు కడగమను, వాళ్ల కూతురు పాల ప్యాకెట్లు తెచ్చిపెడుతుంది. అందులో తప్పేముంది వాళ్లందర్నీ ఆ పని చేయమని చెప్పు.

కిర్రాక్ ఆర్పీ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్, జబర్దస్త్ సెట్ లో ఫుడ్ బాగోదు, అక్కడ మేనేజర్లకు అమ్మాయిల పిచ్చి ఎక్కువ, జబర్దస్త్ పై రాకేష్ మాస్టర్ సంచలన కామెంట్స్..

సినిమా వాళ్లకు ఆఫీస్ ఉండకూడదా? అసలు నేను జబర్దస్త్(jabardasth) లో ఉన్నప్పుడు షేకింగ్ శేషు లేడు. మేమిద్దరం కలిసి చాలా తక్కువ సందర్భాల్లో మాట్లాడుకున్నాం. నేను ఒక వ్యవస్థ ఎలా ఉంది అనేది మాట్లాడాను.నేను అక్కడ మేనేజ్మెంట్ తీరు ఎలా ఉంది అనేది చెప్పాను. అక్కడ నేను వర్క్ చేశాను కాబట్టి అవన్నీ నాకు తెలుసు. నాతో శేషు కి ఏంటి సంబంధం? అతను ఎందుకు నా గురించి మాట్లాడుతున్నాడు? శేషు శ్యాంప్రసాద్ రెడ్డి కి తొత్తు అందుకే అలా మాట్లాడుతున్నాడు అని షేకింగ్ శేషు పై ఆర్పీ ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ బండ బూతులు తిట్టాడు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif