sudigali sudheer and rashmi (Photo-Instagram)

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్.. కాలింగ్ సహస్ర మూవీ ఈవెంట్లో తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఈవెంట్లో రష్మితో పెళ్లెప్పుడు? అనే ప్రశ్న సుధీర్‌కి ఎదురైంది. దీనికి అతను ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చాడు.ఈ ప్రశ్న నాకు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉన్నారు. అంతగా జనం మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. అందుకు థ్యాంక్స్.

రష్మీతో కెమిస్ట్రీ వగైరా అంతా ఆన్ స్క్రీన్ కోసం చేసిందే. ఇక పెళ్లి అంటారా అది నా చేతుల్లో లేదు. ప్రస్తుతానికైతే సినిమాలపైనే ఫోకస్. పెళ్లి గురించి అసలు ఆలోచనే లేదు. చెప్పాలంటే పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఒకవేళ దేవుడు, నన్ను పెళ్లి వైపు తిప్పితే చేసుకుంటానేమో' అని సుధీర్ క్లారిటీ ఇచ్చేశాడు.

అతను చేసిన పనికి ఎన్నో రాత్రులు ఏడ్చాను! నమ్మినందుకు ఘోరంగా మోసం చేశాడంటూ జబర్దస్త్ నటి కన్నీళ్లు, పోలీస్‌ కేసు కూడా పెట్టానంటున్న రీతూ చౌదరి

దీంతో పాటుగా రష్మీతో సినిమా ఎప్పుడు చేస్తారు? అని ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రస్తుతం ఇద్దరికి తగ్గ కథ కోసం చూస్తున్నామని, దొరికినప్పుడు కచ్చితంగా కలిసి నటిస్తామని సుడిగాలి సుధీర్ చెప్పుకొచ్చాడు.కాగా సుధీర్ హీరోగా నటించి కాలింగ్ సహస్ర' మూవీ డిసెంబరు 1న థియేటర్లలోకి రాబోతోంది. గాలోడు' మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్న సుధీర్ ఈ చిత్రంతో ఇంకా పాపులారీటీ సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు.

పెళ్లి పేరుతో కోరికను తీర్చుకున్న జబర్దస్త్‌ కమెడియన్‌, మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి, నవసందీప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

కాలింగ్ సహస్ర సినిమాతో కథానాయికగా 'డోలీషా' పరిచయమవుతోంది. ఇంటర్వ్యూలో సినిమా గురించి సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ .. "ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ... మంచి లవ్ స్టోరీతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి .. కొంచెం ఫన్ ఉంటుంది. కొన్ని సన్నివేశాలు భయపెడతాయి కూడా. ఈ సినిమాలో నా పాత్ర కామెడీ చేయదు .. సీరియస్ గానే సాగుతుంది. అందువలన నేను కొత్తగా అనిపిస్తాను" అని అన్నాడు.ఈ సారి నేను చేసే ప్రయోగంగానే ఈ సినిమాను భావిస్తాను. తప్పకుండా నన్ను ఈ తరహా పాత్రలలో ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారనే నమ్మకం ఉంది" అన్నాడు.

ఇక హీరోయిన్ డోలీషా మాట్లాడుతూ, సుధీర్ కి ఉన్న క్రేజ్ గురించి విన్నాను. ఆ తరువాత ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయాను. ఆయనతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది" అని చెప్పింది.



సంబంధిత వార్తలు

Jabardasth Show: జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్, ఇక‌పై ఆ షో ఉండ‌దు, క‌న్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్, ర‌ష్మీ

HC on Live In Relationship in Islam: ఇస్లాం మతంలో ఉన్నవారు లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండరాదు, అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు, కేసు పూర్వాపరాలు ఏంటంటే..

Rupert Murdoch Engaged: 93 ఏళ్ల వ‌య‌స్సులో ఐదో పెళ్లికి సిద్ధ‌మైన మీడియా మొఘ‌ల్, 67 ఏళ్ల ప్రియురాలితో ఎంగేజ్ మెంట్, గ‌తంలోనూ 65 ఏళ్ల వృద్ధురాలితో నిశ్చితార్ధం

Shoib Malik Marriage: ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న షోయ‌బ్ మాలిక్.. సానియాకు విడాకులు ఇచ్చాడా..లేదా..?

Jabardasth Avinash Viral Post: జబర్దస్త్ అవినాష్ కుటుంబంలో విషాదం, బిడ్డను కోల్పోయానంటూ అవినాష్ ఎమోషనల్ పోస్ట్

Mother Not Legal Heir of Married Son: మరణించిన కొడుకు ఆస్తిపై తల్లికి హక్కు ఉండదు.. అసలైన వారసులు భార్య, పిల్లలే.. మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు.. ఒకవేళ బాధితుడికి భార్య, పిల్లలు లేకపోతే, ఆ ఆస్తి ఎవరికి దక్కుతుంది అంటే?

Telangana: ప్రేమను ఒప్పుకోలేదని యువతికి పురుగుల మందు తాగించిన దుర్మార్గుడు, పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ప్రేమ పేరుతో యువతి వెంటపడి వేధించిన వ్యక్తి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఘాతుకం

Rithu Chowdary Got Cheated: అతను చేసిన పనికి ఎన్నో రాత్రులు ఏడ్చాను! నమ్మినందుకు ఘోరంగా మోసం చేశాడంటూ జబర్దస్త్ నటి కన్నీళ్లు, పోలీస్‌ కేసు కూడా పెట్టానంటున్న రీతూ చౌదరి