Telugu Biggboss Season 8: బిగ్ బాస్ సీజన్ 8 టీజర్ వచ్చేసింది! ఈ సీజన్ లో కంటెస్టెంట్లు ఎవరెవరంటే?
అయితే ఈ సీజన్ 8 డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ బిగ్ బాస్ 8 ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Hyderabad, AUG 02: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తు వస్తున్న సూపర్ పాపులారిటీ ఉన్న ఇండియన్ టీవీ రియాలిటీ షోల్లో టాప్‌లో ఉంటుంది తెలుగు బిగ్‌బాస్ షో (Bigg Boss). కొత్త కొత్త టాస్క్‌లు, గేమ్‌లు, ఛాలెంజెస్, కాంట్రవర్సీస్, వినోదాలతో సాగుతూ అందరినీ టీవీలకు కట్టిపడేస్తుంటుంది. అయితే తెలుగు బిగ్ బాస్ (Telugu Biggboss) సందడి మళ్లీ షురూ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్ ను ప్రారంభించేందుకు స్టార్ మా రెడీ అవుతోంది. ఇప్పటికే 8వ సీజన్‌కు సంబంధించి లోగోను విడుదల చేసిన నిర్వాహాకులు తాజాగా టీజర్‌ను వదిలారు. కమెడియన్ సత్య పాత్రతో పరిచయమైన టీజర్‌లో నాగార్జున వరాలు అందించే జీనీ పాత్రలో కనిపించారు. ఈసారి మరింత ఎంటర్‌టైన్ అవ్వబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతుండగా.. ‘ఒక్కసారి కమిట్ ఐతే లిమిటే లేదు’ అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను అలరిస్తోంది. నాగార్జున గత కొన్ని సీజన్‌ల నుంచి తెలుగు బిగ్ బాస్‌కు హోస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక సీజన్ 8కు కూడా హోస్ట్‌గా నాగార్జున (Nagarjuna Akkineni) కనిపించబోతున్నారు. అయితే ఈ సీజన్ 8 డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ బిగ్ బాస్ 8 ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు సీజన్ 8 స్టార్ట్ కాకముందే ఈ హౌస్ లోపలికి స్టార్ కాస్ట్ వెళ్ళబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతోంది. ఇందులో విష్ణు ప్రియ, రితూ చౌదరి, అమృత ప్రణయ్, బంచిక్ బబ్లు, యూట్యూబర్ అనిల్, యాదమ్మ రాజు, ఖయ్యూమ్ అలీ, సోనియా సింగ్ బిగ్ బాస్ సీజన్8 కంటెస్టెంట్స్‌గా ఎంపికైట్లు సమాచారం. అంతే కాకుండా మరికొందరి పేర్లు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణు స్వామి, క్రికెటర్ అర్జున్, అబ్బాస్, నటుడు రోహిత్,ఇలా పలువురు పేర్లు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నా దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు.