Rahul Sipligunj Chart-busters: మాస్ కా బాస్ రాహుల్ చిచ్చా! తెలుగు బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ కంపోజన్‌లో వచ్చిన కొన్ని టాప్ మ్యూజికల్ హిట్ సాంగ్స్

అతడెప్పుడు అవకాశాల కోసం ఎదురు చూడలేదు, అవకాశాలే తనను వెతుక్కుంటూ వచ్చేలా తనకంటూ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. తన 25 ఏళ్ల అనుభవాన్ని ఈ ఒక్క పాటతో రాహుల్ అందుకున్నాడని టాలీవుడ్ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి అన్నారంటే అర్థం చేసుకోవచ్చు...

Big Boss 3 Winner, Rahul Sipligunj Top Album Hits | File Photos

ఇక నుంచి రోజు రాత్రి 10:30 వరకు టీవీలకు అతుక్కుపోవాల్సిన పనిలేదు. తెలుగు టెలివిజన్ స్క్రీన్‌పై ఐపీఎల్ లాంటి కిక్ ఇచ్చే మెగా ఎంటర్టైన్ మెంట్ లీగ్ బిగ్ బాస్ సీజన్ 3 (Big Boss 3) ముగిసింది. ఈ సీజన్ (Season 3) కు హైదరాబాదీ అస్లీ మాల్ రాహుల్ చిచ్చా (Rahul Chicha) అలియాస్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ అయిన రాహుల్ సిప్లిగంజ్, తెలుగులో ఎన్నో మాస్, ఎనర్జిటిక్ సాంగ్స్ పాడాడు.

టాలెంట్ ఎవరి సొత్తు కాదు అని చెప్పటానికి రాహుల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, అతడెప్పుడు అవకాశాల కోసం ఎదురు చూడలేదు, అవకాశాలే తనను వెతుక్కుంటూ వచ్చేలా తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. తన టాలెంట్‌ను సరిగ్గా వినియోగించుకుంటూ సొంతంగా పాటలు రాసుకొని, మ్యూజిక్ కంపోజ్ చేసి, పక్కా హైదరాబాదీ, తెలంగాణ స్లాంగ్‌లో రాహుల్ పాడిన పాటలు యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆ పాటలతోనే రాహుల్ ఎంతో పాపులర్ అయ్యాడు, ఈరోజు బిగ్ బాస్‌లో రాహుల్‌కి అన్ని ఓట్లు పడటానికి కారణం ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూడా అతడి పాటలకు ఫ్యాన్స్ ఉండటమే. తనదైన యూనిక్ వాయిస్‌తో రాహుల్ పాడే పాటలు, మ్యూజిక్ లవర్స్‌కు ఒక వైవిధ్యమైన మ్యూజిక్ ఫ్లేవర్‌ను అందిస్తాయి. రాహుల్ సిప్లిగంజ్ కంపోజ్ చేసి, పాడిన 'ఐ యామ్ ఎ పూర్ బాయ్' పాట విని, తన 25 ఏళ్ల అనుభవాన్ని ఈ ఒక్క పాటతో రాహుల్ అందుకున్నాడని టాలీవుడ్ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి అన్నారంటే అర్థం చేసుకోవచ్చు,  రాహుల్ కంపోజ్ చేసే సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయనేది.

రాహుల్ సిప్లిగంజ్ కంపోషన్‌లో వచ్చిన కొన్ని టాప్ ఇండిపెండెంట్ మ్యూజిక్ ట్రాక్స్

Daawath Song

Maakkikirkiri Song

Poor Boy Song

Galli Ka Ganesh Song

Hijra Song

Mangamma  Song

Pressure Cooker Movie Promotional Song

Doorame - Melody 

Magajaathi Song

ఇవన్నీ రాహుల్ సిప్లిగంజ్ కంపోజ్ చేసిన చార్ట్ బస్టర్స్, ఇక టాలీవుడ్‌లో జోష్ సినిమాలో కాలేజి బుల్లోడా ఖలేజా ఉన్నోడా నుంచి మొదలు పెట్టి, రంగా రంగా రంగస్థలానా, గ్లాస్ మేట్స్, బొంబాట్, ఇస్మార్ట్ బోనాలు, పెద్దపులి లాంటి ఎన్నో మాస్ హిట్స్ పాడాడు. బిగ్ బాస్ 3 విజేతగా నిలిచిన సందర్భంగా మరోసారి 'లేటెస్ట్‌లీ తెలుగు' అతడికి శుభాకాంక్షలు తెలుపుతుంది.  ఇక ముందూ ఇలాంటి మరెన్నో సాంగ్స్  రాహుల్ నుంచి రావాలని కోరుకుంటోంది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now