Chalaki Chanti: ఫ్రెండ్స్ అయినా డబ్బు విషయంలో ఎవ్వరూ సాయం చేయరు, వాళ్లంతా సర్వనాశనమైపోతారు, ఇది నా శాపమంటూ చలాకి చంటి సంచలన వ్యాఖ్యలు

సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించినప్పటికీ ఈ కామెడీ షోతో ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది. కొన్నేళ్ల పాటు హవా చూపించాడు. కానీ తర్వాత పూర్తిగా ఈ షోకి దూరమైపోయాడు. బిగ్‌బాస్ 6వ సీజన్‌లో పాల్గొన్నాడు గానీ కొన్నాళ్లకే బయటకొచ్చేశాడు.

Chalaki Chanti (photo-Instagram)

చలాకీ చంటి అనగానే 'జబర్దస్త్'లో కామెడీ స్కిట్స్ గుర్తొస్తాయి. సినిమాల్లో చిన్నచిన్న పాత్రలు పోషించినప్పటికీ ఈ కామెడీ షోతో ఎక్కడ లేని గుర్తింపు వచ్చింది. కొన్నేళ్ల పాటు హవా చూపించాడు. కానీ తర్వాత పూర్తిగా ఈ షోకి దూరమైపోయాడు. బిగ్‌బాస్ 6వ సీజన్‌లో పాల్గొన్నాడు గానీ కొన్నాళ్లకే బయటకొచ్చేశాడు. చంటీ ఆ మధ్య తీవ్రమైన అనారోగ్యానికి లోనయ్యాడు.  గతేడాది గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి, క్షేమంగా ఇంటికొచ్చేశాడు.

ఆ తరువాత నుంచి ఆయన కోలుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంటీ మాట్లాడుతూ . "ఆ మధ్య నేను హాస్పిటల్ పాలైనప్పుడు ఒకరిద్దరు తప్పా, ఎవరూ కూడా నన్ను పలకరించలేదు. అంతకుముందు వరకూ నాతో ఉన్నవారు ఆ సమయంలో కనిపించలేదు" అన్నాడు. ఇండస్ట్రీ నుంచి ఒక్కరూ కూడా సహాయం చేయలేదని చంటి చెప్పుకొచ్చాడు. 'నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఒక్కరూ హెల్ప్ చేయలేదు. కనీసం పలకరించలేదు కూడా. కొందరు ఫోన్ చేసి జాగ్రత్త అని చెప్పారంతే.

వీడియో ఇదిగో, మా అమ్మ మళ్లీ చనిపోయింది,పంపించి వస్తానంటూ రాజేంద్రప్రసాద్ భావోద్వేగం

నిజ జీవితంలో ఎవరూ హెల్ప్ చేయరు. డబ్బులు ఉంటేనే ఈ రోజుల్లో బతుకుతాం. డబ్బులు లేకపోతే ఎవరు పట్టించుకోరు. ప్రతి ఆర్టిస్ట్ జీవితం ఇంతే. ఇండస్ట్రీలో ఉంటే ఏదో సంపాదించేస్తున్నారని అనుకుంటారు. కానీ మనకు ఎంతొస్తుందని ఎవరికీ తెలీదు. మనం కూడా ఎవరి దగ్గర సాయం ఆశించకూడదు. ఫ్రెండ్స్ అయినా డబ్బు విషయంలో సాయం చేయరు' అని చంటి చెప్పుకొచ్చాడు.

" నన్ను చూసిన వాళ్లంతా బాగా సంపాదిస్తున్నాడని అనుకుంటారు. కానీ అలా కనిపించకపోతే ఇక్కడ ఎవరూ పట్టించుకోరు .. ఎవరూ దేనికీ పిలవరు. అందువలన కష్టమైనా .. నష్టమైనా మెయింటైన్ చేయాలి. అలా చేయడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఇక్కడ ఎవరైనా సరే నువ్వు బాగుంటేనే 'బాగున్నావా' అని అడుగుతారు. బాగోలేకపోతే కనిపించకుండా పోతారు. ఇది కలియుగం .. ఇక్కడ ఎవరినీ నమ్మడానికి లేదు .. ఎవరిపై ఆశలు పెట్టుకోకూడదు" అని చెప్పాడు.

"నాకు ఇగో ఎక్కువనీ .. షూటింగుకు వస్తే నేను చాలా అడుగుతానని కొంతమంది ప్రచారం చేశారు. కొంతమంది నాకు సంబంధంలేని విషయాల్లో నన్ను ఇరికించారు. నాకు రావలసిన అవకాశాలు రాకుండా ఆపేశారు. అలాంటి వాళ్లంతా సర్వనాశనమై పోతారు .. వాళ్లందరికీ ఇదే నా శాపం. ప్రత్యక్షంగా గానీ .. పరోక్షంగా గాని నాకు చెడు చేయడానికి ప్రయత్నించిన వాళ్లంతా నాశనమైపోతారు. అలా జరగాలని దేవుడిని రోజుకి వందసార్లు కోరుకుంటున్నా" అని అన్నాడు.

చంటి చెప్పిన దానిబట్టి చూస్తే 'జబర్దస్త్', సినిమాలు చేస్తున్న టైంలో చాలామంది స్నేహితులు ఉన్నారు. కానీ ఆపదలో ఎవరూ తనని ఆదుకోవడానికి రాలేదే అని బాధపడుతున్నట్లు అనిపిస్తుంది. అదే టైంలో రియాలిటీ ఏంటనేది కూడా చెప్పకనే చెప్పారు. అలానే జబర్దస్త్ షోలో వాళ్లే వద్దన్నారని, దానికి కారణం కూడా తెలీదని చెప్పాడు. వాళ్లు వద్దన్న తర్వాత ఇక తాను మళ్లీ అడగనని, అది కరెక్ట్ కాదని కూడా క్లారిటీ ఇచ్చేశాడు.