Agriculture Budget 2020-21: రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం! వ్యవసాయం, నీటిపారుదల కోసం రూ .2.83 లక్షల కోట్లు, వ్యవసాయ రుణాల కోసం రూ.15 లక్షల కోట్లు సమకూర్పు
2.83 లక్షల కోట్ల నిధులను కేటాయించారు. వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి దీని పరిధిలోకి వస్తాయి.....
New Delhi, February 1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శనివారం యూనియన్ బడ్జెట్ 2020ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇందులో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 2020-21 ఏడాదికి గానూ రూ. 2.83 లక్షల కోట్ల నిధులను కేటాయించారు. వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి దీని పరిధిలోకి వస్తాయి. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.
వ్యవసాయానికి చేయూత మరియు రైతుల సంక్షేమం కోసం 16 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి వివరించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద మొత్తం 6.11 కోట్ల మంది రైతులకు బీమా జరిగిందని పేర్కొన్నారు.
ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ అంశాలను జాబితా ఈ విధంగా ఉంది
- గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు సాధికారత కల్పించడానికి స్వయం సహాయక సంఘాల ఏర్పాటు. ధాన్యలక్ష్మి పథకం కింద ఆర్థిక సహాయం. మరియు రైతుల సౌకర్యార్థం నాబార్డ్ నిధుల సహాయంతో గ్రామాల్లో పంట నిల్వ చేసుందుకు అగ్రి గిడ్డంగుల ఏర్పాటు.
- రైతులకు సరైన ఎరువు మరియు సమతుల్య పద్ధతిలో ఎరువులను, నీటి వాడకాన్ని ప్రోత్సహించడం. రసాయన ఎరువుల వాడకంలో మార్పులు.
- నీటి ఎద్దడి, కరువు పరిస్థితులున్న 100 జిల్లాలకు సమగ్ర చర్యలు
- 20 లక్షల మంది రైతులకు సహాయం చేయడానికి పిఎం కుసుమ్ సోలార్ పంప్ పథకాన్ని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తుంది. బంజరు / తడి భూములున్న రైతులకు సోలార్ యూనిట్లు ఏర్పాటుకు అనుమతి మరియు గ్రిడ్లకు విద్యుత్ సరఫరా.
- జాతీయ శీతల సరఫరా పథకం: పాలు మరియు ఇతర పాడైపోయే ఉత్పత్తుల కోసం రైళ్లలో రిఫ్రిజిరేటెడ్ బోగీలతో పిపిపి మోడ్‌లో కిసాన్ రైలు ఏర్పాటు.
- హార్టికల్చర్ రంగం ఆహార ధాన్యాల ఉత్పత్తి సామర్థ్యం 311 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంపు. ప్రతి జిల్లాలో, రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో ఒక ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ప్రోత్సాహం.
- వ్యవసాయం సీజన్ లేని సమయంలో సౌరశక్తి, తేనెటీగల పెంపకం మొదలైనవాటిని ప్రోత్సహించడానికి వర్షాధార ప్రాంతాలలో సమగ్ర వ్యవసాయ వ్యవస్థల విస్తరింపు.
- ఈశాన్య ప్రాంతంలో కనెక్టివిటీని పెంచడం కోసం కృష్ణ ఉడాన్‌ను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జాతీయ మరియు అంతర్జాతీయ మార్గాల్లో ప్రారంభించనుంది.
- ఆన్‌లైన్ లో సేంద్రీయ మార్కెట్ బలోపేతం.
- 2025 నాటికి పాల ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని 108 మిలియన్ మెట్రిక్ టన్నులకు రెట్టింపుకు ప్రతిపాదన.
- చేపల ఉత్పత్తి 2021-22 నాటికి 200 లక్షల టన్నులకు పెంపు.
- 2021 నాటికి వ్యవసాయ రుణాల కోసం రూ. 15 లక్షల కోట్లు అందుబాటులోకి తీసుకురావాలి.
- పశువులలో పాదం మరియు నోటి వ్యాధి బ్రూసెలోసిస్ నివారించే ప్రతిపాదన, 2025 నాటికి గొర్రెలలో పిపిఆర్
- సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా ఆల్గే మరియు సీవీడ్ పెంపకాన్ని ప్రోత్సహం.
- మత్స్య రంగంలో యువత “సాగర్ మిత్రాస్” గా పాల్గొని 500 చేపల రైతు ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సాహం.