Bomb Threats to 40 Delhi Schools: ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్.. తొలుత రెండు ఇప్పుడు ఏకంగా 40 పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించి తనిఖీలు

నేటి ఉదయం మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఈసారి విమానాలకు కాకుండా పాఠశాలలకు ఈ హెచ్చరికలు వచ్చాయి.

(Photo Credits File)

Newdelhi, Dec 9: బాంబు బెదిరింపులతో (Bomb Threats) దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కలకలం మొదలైంది. నేటి ఉదయం మళ్లీ బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే ఈసారి విమానాలకు కాకుండా పాఠశాలలకు ఈ హెచ్చరికలు వచ్చాయి. సోమవారం ఉదయం ఢిల్లీలోని రెండు పాఠశాలల్లో బాంబులు ఉన్నట్లు తొలుత బెదిరింపులు వచ్చాయి. ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (DPS), పశ్చిమ్‌ విహార్‌ లోని జీడీ గోయెంకా స్కూళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్‌ ద్వారా ఈ బాంబు హెచ్చరికలు జారీ చేశారు.  అయితే, క్రమంగా ఈ సంఖ్య ఏకంగా 40కు చేరింది. అవును.. ఢిల్లీలోని ఏకంగా 40 స్కూల్స్ లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థులను ఇండ్లకు పంపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాంబు స్క్వాడ్‌తోపాటు అగ్నిమాపక సిబ్బంది రెండు స్కూళ్లలో తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దుండగులు 30 వేల డాలర్లు ఇవ్వాలని అడిగినట్టు సమాచారం.

తెలంగాణ త‌ల్లి విగ్ర‌హంపై కేసీఆర్ స్పంద‌న ఇదే! రేవంత్ స‌ర్కారు తీరుపై ఫిబ్ర‌వ‌రిలో భారీ బ‌హిరంగ స‌భ‌

రెండు నెలల కిందట బాంబు పేలుడు

రెండు నెలల క్రితం దేశవ్యాప్తంగా ఉన్న పలు సీఆర్‌పీఎఫ్‌ స్కూళ్లకు కూడా ఇదే విధంగా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్‌ 21న ఢిల్లీలోని రెండు, హైదరాబాద్‌, తమిళనాడులోని ఓ సీఆర్‌పీఎఫ్‌ పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి. అదేవిధంగా ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో అక్టోబర్‌ 20న సీఆర్‌పీఎఫ్‌ స్కూల్‌ ఆవరణలో భారీ పేలుడు కూడా సంభవించింది.

కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ సమావేశం, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యే-ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ చీఫ్ దిశానిర్దేశం