Kurnool: ప్రార్థన పేరుతో బాలికలకు పురుషాంగం చూపుతూ వికృత చేష్టలు, కీచక మతబోధకుడు అరెస్టు,

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామంలో చర్చి నిర్వహించే పాస్టర్ ప్రసన్న కుమార్ అదే గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదైంది.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

చర్చిలో పాస్టర్ లైంగిక అకృత్యాలకు సంబంధించిన వీడియోలు సంచలనం రేపడంతో పోలీసులు రంగంలోకి దిగి అతణ్ని అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం శెట్టివీడు గ్రామంలో చర్చి నిర్వహించే పాస్టర్ ప్రసన్న కుమార్ అదే గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదైంది. గ్రామంలో చర్చిని నిర్వహిస్తోన్న ప్రసన్న కుమార్, ప్రార్థన పేరుతో పిల్లలకు చర్చికి పిలిపించేవాడు. ఆ క్రమంలో కొందరు బాలికలతో పాస్టర్ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇతని వికృత చేష్టలకు చాలా మంది పిల్లలు ఇబ్బంది పడగా, ఇద్దరు బాలికల వ్యవహారంలో దొరికిపోయాడు..

గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోవడంతో కష్టపడి కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు ఆడపిల్లల్ని చదివిస్తోంది. తల్లి పనికి వెళ్లగా ఇంట్లోనే ఉన్న ఇద్దరు బాలికలను పాస్టర్ ప్రసన్న కుమార్ ప్రార్థన కోసం పిలిచేవాడు. ప్రార్థన పేరుతో చర్చికి పిలిచిన పాస్టర్.. వారితో చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడు. అంతేకాదు  తన మర్మాంగం పట్టుకోమని బాలికల పట్ల దారుణంగా ప్రవర్తించాడు. పాస్టర్ చేసే వికృత చేష్టలకు షాక్ తిన్న  ఇద్దరు పిల్లలు.. తల్లికి చెప్పగా, ఆమె కంగుతిన్నది.

అయితే కీచకుడిని నిలదీయగా, పాస్టర్ ప్రసన్న కుమార్ తన పలుకుబడిని ఉపయోగించి ఊరి పెద్దల ద్వారా సెటిల్మెంట్ కుదుర్చుకున్నాడు. బాధిత బాలికలకు రూ.50 వేలు పరిహారంగా ఇచ్చేందుకు అంగీకరించిన పాస్టర్.. ఈ సెటిల్మెంట్ చేసినందుకుగానూ ఊరి పెద్దలకు రూ.10వేలు ముట్టజెప్పాడు. పోలీస్ కేసు కాకుండా మరో రూ.5వేలూ ఇచ్చాడు. కాగా, అనూహ్య రీతిలో పాస్టర్ ప్రసన్న కుమార్ అకృత్యం వీడియో ఒకటి బయటపడింది. బాలికలపై పాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడుతోన్న వీడియో శెట్టివీడుతోపాటు కర్నూలు జిల్లా అంతటా వైరలైంది. ఈ ఘటనపై పలు న్యూస్ చానళ్లలో వార్తలు కూడా ప్రసారం అయ్యాయి. దీంతో చాగలమర్రి పోలీసులు కేసు బుక్ చేయకతప్పలేదు. పాస్టర్ ప్రసన్న కుమార్ పై పోక్సో, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని చాగలమర్రి పోలీసులు తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif