Exam Time Table: పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల, ఏడాది మార్చి 19, 2020 నుంచి పరీక్షలు ప్రారంభం, ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల టైమ్ టేబుల్ కూడా గమనించండి
మార్చి 19, 2020 నుంచి ఏప్రిల్ 06, 2020 వరకు పరీక్షలు, ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షల టైమ్ టేబుల్ కూడా ఇప్పటికే విడుదలైంది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 04, 2020న ప్రారంభమై, మార్చి 21న ముగుస్తాయి. సెకండ్ ఇయర్ మార్చి 05, 2020న ప్రారంభమై మార్చి 23న ముగుస్తాయి.
Hyderabad, December 4: తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 19, 2020 నుంచి ఏప్రిల్ 06, 2020 వరకు పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ సెకండరీ బోర్డ్ (TSBSE - Board of Secondary Education, Telangana) నిర్ణయించింది. అన్ని పరీక్షలు ఉదయం 9:30 కు ప్రారంభమవుతాయి. అయితే సబ్జెక్ట్ ను బట్టి మధ్యాహం 12:15 నుంచి 12:45 వరకు పరీక్షను నిర్వహించనున్నారు.
ఈ మేరకు పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు మార్గదర్శకాలు జారీ చేశారు.
అన్ని సబ్జెక్టులలోని ఆబ్జెక్టివ్ పేపర్ (పార్ట్-బి) కు చివరి అరగంటలో మాత్రమే సమాధానం ఇవ్వాలి.
విద్యార్థులు తమకు కేటాయించిన కోడ్ ప్రకారం ఇవ్వబడిన ప్రశ్నాపత్రానికి మాత్రమే సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర కాంబినేషన్ ప్రశ్నాపత్రాలు ఇస్తే ఆ సమాధానాలు చెల్లవు.
తెలంగాణ సెకండరీ బోర్డ్ ద్వారా గుర్తింపు కార్డ్ పొందిన విద్యార్థి కాకుండా, బదులుగా ఇతరులెవరైనా పరీక్షకు హాజరైతే, అతడి పరీక్ష రద్దు చేయబడుతుంది.
ఇక టైమ్ టేబుల్ ఇలా ఉంది
తెలంగాణలో జరిగే ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షల టైమ్ టేబుల్ కూడా ఇప్పటికే విడుదలైంది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 04, 2020న ప్రారంభమై, మార్చి 21న ముగుస్తాయి. సెకండ్ ఇయర్ మార్చి 05, 2020న ప్రారంభమై మార్చి 23న ముగుస్తాయి.
అన్ని పరీక్షలను ఉదయం 09:00 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12:00 గంటలకు నిర్వహిస్తారు. టైమ్ టేబుల్ ఈ విధంగా ఉంది.
ఫస్ట్ ఇయర్ టైమ్ టేబుల్ :
Telangana Inter 1st Year Exam Time Table 2020 | |
Date | Telangana Inter 1st Year Subjects |
04 March 2020 | Part II:
Second language paper I |
06 March 2020 | Part I:
English Paper I |
10 March 2020 | Part III:
Mathematics Paper IA Botany Paper I Civics Paper I Psychology Paper I |
12 March 2020 | Mathematics Paper IB
Zoology Paper I History Paper I |
14 March 2020 | Physics Paper I
Economics Paper I Classical Language Paper I |
17 March 2020 | Chemistry Paper I
Commerce Paper I Sociology Paper I Fine Arts, Music Paper I |
19 March 2020 | Geology Paper I
Home Sciences Paper I Public Administration Paper I Logic Paper I Bridge Course Mathematics Paper I (for Bi PC candidates) |
21 March 2020 | Modern Language Paper I
Geography Paper I |
సెకండ్ ఇయర్ టైమ్ టేబుల్ :
Date | Telangana Inter Exams 2nd Year Subjects |
05 March 2020 | Part II:
Second Language Paper-II |
07 March 2020 | Part I:
English Paper-II |
11 March 2020 | Part III:
Mathematics Paper-IIA Botany Paper-II Civics Paper-II Psychology Paper-II |
13 March 2020 | Mathematics Paper-IIB
Zoology Paper-II History Paper-II |
16 March 2020 | Physics Paper-II
Economics Paper-II Classical Language Paper-II |
18 March 2020 | Chemistry Paper-II
Commerce Paper-II Sociology Paper-II Fine Arts Music Paper-II |
20 March 2020 | Geology Paper II
Home Sciences Paper-II Public Administration Paper-II Logic Paper-II Bridge Course Maths Paper-II (for Bi PC candidates) |
23 March 2020 | Modern Language Paper-II
Geography Paper-II |
అయితే ఇక్కడ ఒక ముఖ్య గమనిక: ఈ ప్రకటించబడిన పదో తరగతి లేదా ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఫైనల్ అని కాదు, షెడ్యూల్ మారే అవకాశం కూడా ఉంటుంది. ముందుగా నిర్ణయించిన తేదీలలో అనివార్య కారణాలు తలెత్తి పరీక్షలు జరగని పక్షంలో లేదా సెలవులు లేదా బంద్ లు వస్తే తదనుగుణంగా మార్పులు జరుగుతాయి. ఆల్ ది బెస్ట్!