TS EAMCET 2022 Results: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల తేదీపై నేడు క్లారీటీ,రిజల్ట్స్ విడుదలైన తర్వాత eamcet.tsche.ac.in ద్వారా మీ ఫలితాలు చెక్ చేసుకోండి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్‌ఎంసెట్‌) ఫలితాలు (TS EAMCET 2022 Results) ఎప్పుడు వెల్లడిస్తారనే దానిపై నేడు క్లారిటీ రానుంది.

Representational Image (Photo Credits: PTI)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్‌ నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్‌ఎంసెట్‌) ఫలితాలు (TS EAMCET 2022 Results) ఎప్పుడు వెల్లడిస్తారనే దానిపై నేడు క్లారిటీ రానుంది. దీనిపై ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి నేతృత్వంలో ఉన్నతస్థాయి భేటీ జరగనుంది. ఇందులో ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్థన్, మండలి కార్యదర్శి శ్రీనివాస్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు.

ఎంసెట్‌ ఫలితాల తీరు తెన్నులు, ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను ఈ కమిటీలో చర్చిస్తారు. అందుతున్న సమాచారం ప్రకారం ఎంసెట్‌ ఫలితాల విడుదల (TS EAMCET 2022 Results Date) ఈ నెల 15వ తేదీలోపే ఉండే వీలుంది. తామంతా సిద్ధంగానే ఉన్నామని, మంత్రి ఎప్పుడు తేదీ ఇస్తారో చూడాలని అధికారులు అంటున్నారు. ఎంసెట్‌ ఫలితాలు వెలువడిన తర్వాత ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలవ్వ నుంది.

తెలంగాణలో 2022-23 విద్యాసంవత్సరానికి క్యాలెండర్‌ విడుదల, ఈ విద్యా సంవత్సరంలో 230 రోజులు పాఠశాలలు పనిదినాలు, పండుగ‌ల సెల‌వులను ఓసారి చెక్ చేసుకోండి

మరోవైపు జేఈఈ ఫలితాలు వెల్లడవ్వడం, ఈ నెలాఖరు నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షల నేపథ్యంలో కౌన్సెలింగ్‌ను ఎన్ని దఫాల్లో పూర్తి చేయాలనే విషయాలపై అధికా రులు చర్చిస్తారు. కాగా, ఫలితాల వెల్లడి తర్వాత జేఎన్‌టీయూహెచ్‌ తన పరిధిలోని ప్రైవేటు కళాశాలలను తనిఖీ చేసి, అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement