తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్‌ను 2022-23 సంత్సరానికి గాను విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు మొత్తం 230 పని దినాలు ఉంటాయని తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 24వ తేదీ వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. సమ్మర్ వెకేషన్ ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు ఉండనుంది. మొదటి ఎఫ్ఏ( formative assessment )జులై 21 లోపు, ఎఫ్ఏ-2 పరీక్షలు సెప్టెంబర్ 5 లోపు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ సూచించింది. ఇక ఎస్ఏ-1( summative assessment ) పరీక్షలు నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
ఎఫ్ఏ-3 ఎగ్జామ్స్ డిసెంబర్ 21 లోపు, ఎఫ్ఏ -4 పరీక్షలను పదో తరగతి విద్యార్థులకు జనవరి 31 లోపు, 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి 28 లోపు నిర్వహించనున్నారు. 1 నుంచి 9 తరగతులకు ఎస్ఏ-2 పరీక్షలను ఏప్రిల్ 10 నుంచి 17 వరకు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఫిబ్రవరి 28 లోపు టెన్త్ స్టూడెంట్స్‌కు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఎస్సెస్సీ బోర్డు ఎగ్జామ్స్ మార్చి నెలలో నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఈ విద్యా సంవత్సరంలో 230 రోజులు పాఠశాలలు పనిదినాలు
►ఏప్రిల్ 24, 2023 విద్యాసంవత్సరం చివరి రోజు
►వేసవి సెలవులు: ఏప్రిల్ 25, 2023 నుంచి జూన్ 11, 2023 వరకు
►ప్రైమరీ స్కూల్స్: ఉదయం 9am నుంచి 4pm వరకు తరగతులు
►ప్రాథమికోన్నత పాఠశాలలు: ఉదయం 9am నుంచి 4.15pm వరకు తరగతులు
►ఉన్నత పాఠశాలల తరగతులు: ఉదయం 9.30am నుంచి 4.45pm వరకు తరగతులు
పండుగల సెలవులు ఇవే..
దసరా సెలవులు – అక్టోబర్ 26 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు(14 రోజులు)
క్రిస్మస్ సెలవులు – డిసెంబర్ 22 నుంచి 28 వరకు(7 రోజులు)
సంక్రాంతి సెలవులు – జనవరి 13 నుంచి 17 వరకు(5 రోజులు)