APPSC Group 1 Notification 2023: నిరుద్యోగులకు మరో తీపి కబురు, గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేసిన ఎపీపీఎస్సీ, పూర్తి వివరాలు ఇవిగో..
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను ఎపీపీఎస్సీ విడుదల చేసింది. 81 పోస్టులతో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 17న ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. డిప్యూటీ కలెక్టర్ 9, డిఎస్పీలు 26 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో తీపికబురు చెప్పింది. గ్రూప్ -1 నోటిఫికేషన్‌ను ఎపీపీఎస్సీ విడుదల చేసింది. 81 పోస్టులతో గ్రూప్ -1 నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రిలిమినరీ పరీక్ష మార్చి 17న నిర్వహిస్తారు. ఆఫ్‌లైన్ మోడ్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహించబోయే మెయిన్ పరీక్ష తేదీని ఇంకా ఖరారు చేయలేదు. డిప్యూటీ కలెక్టర్ 9, డిఎస్పీలు 26 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టుల వివరాలివే..
ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9; ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ 18; డీఎస్పీ (సివిల్) 26; రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ 6; కోఆపరేటివ్ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5; జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 4; జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3; అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు 3; అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2; జైళ్ళ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. పరీక్ష విధానం, సిలబస్ తదితర పూర్తి వివరాలను ఈ కింది పీడీఎఫ్‌లో చూడొచ్చు.
Here's Notification
నిన్న గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 897 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)