APSRTC Special Offer: సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరపై రాయితీ..

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకేసారి నలుగురికి (పిల్లలు సహా) టికెట్లు కొంటే ఛార్జీలపై 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. తిరుగు ప్రయాణానికి కూడా ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకుంటే ఆ టికెట్ల ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చని వెల్లడించింది.

Credits: Twitter/APSRTC

Vijayawada, Jan 1: సంక్రాంతికి (Sankranti) సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) బంపర్ ఆఫర్ (Bumper Offer) ప్రకటించింది. ఒకేసారి నలుగురికి (పిల్లలు సహా) టికెట్లు కొంటే ఛార్జీలపై (Charges) 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. తిరుగు ప్రయాణానికి కూడా ఇప్పుడే టికెట్లు (Tickets) బుక్ చేసుకుంటే ఆ టికెట్ల ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్ (Discount) పొందొచ్చని వెల్లడించింది.

శ్మశానంలోని ఊడలమర్రికి వేలాడుతూ దెయ్యాల న్యూఇయర్ సంబురాలు.. పంజాబ్ లో ఘటన.. అసలు ఏం జరిగింది?? వీడియోతో..

పండుగ రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేకంగా బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు 6,400 స్పెషల్ బస్సులను తిప్పుతామని వివరించారు. ఈ స్పెషల్ బస్సులలో కూడా సాధారణ బస్సుల ఛార్జీలు వసూలు చేయడంతో పాటు అదనంగా రాయితీని అమలు చేయనున్నట్లు తెలిపారు.

కళ్లు మిరుమిట్లు గొలిపే రీతిలో 2023కి స్వాగతం పలికిన సిడ్నీ నగరం... ఆనందోత్సాహాల్లో హైదరాబాదీలు, వైజాగ్ ప్రజలు.. వీడియోలు ఇవిగో!

ఇప్పటికే వృద్ధులకు టికెట్ ధరపై 25 శాతం రాయితీ ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు గుర్తుచేశారు. కుటుంబం సహా సొంతూరుకు వెళ్లే వారు తాజాగా ప్రకటించిన రాయితీతో తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చని చెప్పారు. కాగా, ఈ-వాలెట్ ద్వారా చేసుకునే టికెట్ బుకింగ్ లకూ రాయితీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.

కొత్త ఏడాది నిరుద్యోగులకు శుభవార్త... మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్ పీఎస్ సీ

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement