
Hyderabad, Jan 1: ప్రపంచంలోని పలు దేశాలు 2023 సంవత్సరానికి ఘనస్వాగతం పలికాయి. ఆస్ట్రేలియా (Australia) కూడా నూతన సంవత్సరాదిని (New Year) అట్టహాసంగా ఆహ్వానించింది. తూర్పు తీరంలోని సిడ్నీ (Sidney) నగరం బాణసంచా వెలుగులతో నిండిపోయింది. కళ్లు మిరుమిట్లు గొలిపే రంగురంగుల బాణసంచా ఆకాశంలో అద్భుతమైన వర్ణచిత్రాన్ని ఆవిష్కరించింది. లేజర్ లైటింగ్, విద్యుద్దీప కాంతులు, బాణసంచా వెలుగులతో సిడ్నీ హార్బర్, ఐకానిక్ ఓపెరా హౌస్, సిడ్నీ బ్రిడ్జి కనువిందు చేశాయి. అటు హైదరాబాద్, వైజాగ్ లో కూడా న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
కొత్త ఏడాది నిరుద్యోగులకు శుభవార్త... మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్ పీఎస్ సీ
Sydney leads global New Year’s Eve celebrations pic.twitter.com/gTUUxZGsAZ
— PressTV Extra (@PresstvExtra) December 31, 2022