Independence Day 2024: హర్ ఘర్ తిరంగా సర్టిఫికెట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి, అయితే మీ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఆగస్టు 15 వరకు ఈ కార్యక్రమం జరగనుండగా ప్రతి వ్యక్తి తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
Hyd, Aug 14: భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9 నుండి హర్ ఘర్ తిరంగ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు 15 వరకు ఈ కార్యక్రమం జరగనుండగా ప్రతి వ్యక్తి తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.
2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ సమైక్యతను పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. 2022లో దేశంలోని 23 కోట్ల ఇళ్లపై జాతీయ జెండా ఎగరగా 2023లో 10 కోట్లకు పైగా సెల్ఫీలు తీసుకుని ఆ ఫోటోలను అప్‌లోడ్ చేసి 'హర్ ఘర్ తిరంగ' సర్టిఫికేట్ పొందారు.
మీరు కూడా హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో పాల్గొని ఈజీగా సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ harghartiranga.comలోకి వెళ్లాలి.
()'అప్‌లోడ్ సెల్ఫీ'పై క్లిక్ చేయాలి
()మీ పేరు, ఫోన్ నంబర్, దేశం మరియు రాష్ట్రాన్ని నమోదు చేయాలి
() తర్వాత డౌన్‌లోడ్ సర్టిఫికేట్‌ను క్లిక్ చేసయాలి.
()ఈ ఫారం నింపేటప్పుడు మీరు అక్కడున్న ప్రతిజ్ఞను జాగ్రత్తగా చదవాలి
()ప్రతిజ్ఞ తర్వాత take pledge ఎంచుకోవాలి. తర్వాత మిమ్మల్ని మరో పేజీకి తీసుకెళ్తుంది.
()అక్కడ మీరు త్రివర్ణ జెండాతో దిగిన సెల్ఫీలను పోస్ట్ చేసి.. తర్వాత సబ్‌మిట్ బటన్ క్లిక్ చేయాలి.
()అనంతరం Generate Certificate ఆప్షన్ ఎంచుకుని క్లిక్ చేయాలి. మీకు సర్టిఫికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ సర్టిఫికెట్‌ను మీరు మొబైల్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ‘హర్ ఘర్ తిరంగా’లో భాగం కండి.. మీ ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను పెట్టుకోండి.. జాతి జనులకు ప్రధాని మోదీ పిలుపు
అయితే ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
() జాతీయ జెండా క్రమం కుంకుమపువ్వు పై భాగంలో, మధ్యలో తెలుపు , దిగువన ఆకుపచ్చ రంగు ఉంటుంది. ఎందుకంటే జెండాను ఎప్పుడూ తలకిందులుగా ఎగురవేయకూడదు.
() మంచిగా ఉన్న జాతీయ జెండాలనే ఎగురవేయాలి. చిరిగిన లేదా దెబ్బతిన్న జెండాలను ఎగురవేయకూడదు.
()జెండా ఎల్లప్పుడూ నిటారుగా ఉండాలి
()జాతీయ జెండాను అలంకరణగా లేదా దుస్తులు, యూనిఫాంలో ఉపయోగించకూడదు.
()జెండా 3:2 నిష్పత్తిలో ఉండాలి.