Heavy Rain Alert For Hyderabad: బంగాళాఖాతంలో వాయుగుండం, తీవ్ర తుఫానుగా మారనున్న ‘మహా’, హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన, తెంగాణాలో ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం

దీని ప్రభావంతో నవంబర్ 4న ఉత్తర అండమాన్‌ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

MAHA-Cyclone-Rain-forecast-in-Telangana (Photo-Twitter)

Hyderabad, November 3: అరేబియా సముద్రంలో ఏర్పడిన మహా తుఫాను రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నవంబర్ 4న ఉత్తర అండమాన్‌ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి వచ్చే రెండు మూడు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారవచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాజధాని హైదరాబాద్‌లో రానున్న 36 గంటల్లో వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే శనివారం హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి నమోదయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 31.2 డిగ్రీలుగా నమోదుకాగా.. కనిష్ట ఉష్ణోగ్రత 22.5 డిగ్రీల సెల్సియస్ రికార్డైంది. గాలిలో తేమ 55 శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు.



సంబంధిత వార్తలు

Realme 14X 5G: రియల్ మి నుంచి తొలిసారిగా ఐపీ69 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌ స్మార్ట్‌ఫోన్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో రియల్‌మీ 14ఎక్స్‌ 5జీ వచ్చేసింది, ధర, పీచర్లు ఇవిగో..

SBI Alert! ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటూ ఎస్బీఐ మేనేజర్ల పేరిట డీప్ ఫేక్ వీడియోలు, నమ్మొద్దని కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసిన ఎస్బీఐ

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు