Rains Update: ఈ తొలివారంలోనే వరుణుడి పలకరింపు.. ఈ నెల సగటు వర్షపాతానికి 9% అటూఇటూగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా.. గత నెలలో మొహం చాటేసిన వానలతో ప్రజల బేజారు
దక్షిణాది, మధ్య భారత్ లో ఈ వారం వానలు కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మీడియా సమావేశంలో వెల్లడించారు.
Newdelhi, September 1: ఎల్ నినో (Elnino) ప్రభావంతో గత నెలలో మొహం చాటేసిన వానలు (Rains) ఈ నెలలో మళ్లీ పలకరిస్తాయని వాతావరణ శాఖ తాజాగా భరోసా ఇచ్చింది. దక్షిణాది, మధ్య భారత్ లో ఈ వారం వానలు కురుస్తాయని ఐఎండీ (IMD) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మీడియా సమావేశంలో వెల్లడించారు. 'జూలైలో అధిక వర్షాల తరువాత ఆగస్టులో చాలా వరకూ రుతుపవనాలు మొహం చాటేశాయి. ఎల్నినో పరిస్థితులే దీనికి కారణం. అయితే, ఈ నెలలో దేశంలో అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు. సెప్టెంబర్ నెల దీర్ఘకాలిక సగటు వర్షపాతం 167.9 మి.మీకు 9 శాతం అటూఇటూగా ఈ నెల వానలు కురుస్తాయని అన్నారు. అధిక వర్షపాతం నమోదైనా అది జూన్-సెప్టెంబర్ కాలపు సగటు వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండొచ్చని అంచనా వేశారు.
122 ఏండ్లలో ఇదే తొలిసారి
గత నెలలో 20 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఎక్కడా చినుకుపడలేదు. గడిచిన 122 ఏండ్లలో ఇదే తొలిసారి.