TSPSC Notifications: కొత్త ఏడాది నిరుద్యోగులకు శుభవార్త... మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్ పీఎస్ సీ

2023 కొత్త ఏడాదికి నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) శుభవార్త చెప్పింది. ఇటీవల పలు ఉద్యోగ నియామకాల ప్రకటనలు విడుదల చేసిన టీఎస్ పీఎస్ సీ తాజాగా మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసింది.

Credits: Twitter

Hyderabad, Jan 1: 2023 కొత్త ఏడాదికి నిరుద్యోగులకు (Un Employees) తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) (TSPSC) శుభవార్త (Good News) చెప్పింది. ఇటీవల పలు ఉద్యోగ నియామకాల ప్రకటనలు విడుదల చేసిన టీఎస్ పీఎస్ సీ తాజాగా మరికొన్ని నోటిఫికేషన్లు (Notifications) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ప్రకారం... డిగ్రీ కళాశాలలకు సంబంధించి 544 పోస్టులు, మున్సిపల్ శాఖలో 78 పోస్టులు... ఇంటర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ లో 71 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

నూతన సంవత్సర శుభాకాంక్షలు! న్యూ ఇయర్ 2023 సందేశాలు, 2023 ఫేస్‌బుక్ స్టేటస్ చిత్రాలు, 2023 Quotesకు సంబంధించి కొన్ని ఆణిముత్యాలను HD వాల్‌పేపర్ల రూపంలో మీకోసం

డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే, లేదా జూన్ లో పరీక్ష ఉంటుంది. మున్సిపల్ శాఖలో ఉద్యోగాలకు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.

జనవరిలో కరోనా మరణమృదంగమే! చైనాలో ప్రతిరోజు 25వేల మంది చనిపోయే అవకాశముందని హెచ్చరిక 

ఇంటర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు టీఎస్ పీఎస్ సీ వెబ్ సైట్ (tspsc.gov.in) ను సందర్శించవచ్చు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement