Hyderabad, Jan 4: జంట నగరాల్లో జలాశయాలను పరిరక్షించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాలో (HYDRA) అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల (Jobs) భర్తీకి మార్గం సుగమమైంది. అతి త్వరలో 970 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ఒక ఏజెన్సీ ద్వారా ఒక సంవత్సరం పాటు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను నింపనున్నారు. ఇందులో 203 మేనేజర్, 767 అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. కొత్తగా వచ్చే అధికారులకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలో కూడా అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది.
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. రైతు భరోసా మీదనే ప్రధాన చర్చ.. ఇంకా ఈ విషయాలపై కూడా..
పనులు ఇవే
ఔటర్ రింగ్ రోడ్డు లోపల హైడ్రా పరిధిలో ఉన్న నీటి వనరులు, పార్కులు, ప్రభుత్వభూములు, నాలాలను రక్షించడంలో హైడ్రాకు సహాయం చేయడం, అనధికార నిర్మాణాలు, ఆక్రమణలను గుర్తించడం వీరి బాధ్యతగా నిర్ణయించారు. హైదరాబాద్ లోని ఫుట్ పాత్ లతో పాటు జలవనరులు, ప్రభుత్వస్థలాల్లో వెలసిన ఆక్రమణలను తొలగించడంలో వీరిదే కీలకపాత్ర అని అధికారులు చెప్పారు.
ఏడు ప్యాకేజీలుగా విభజన
ఎంపికైన అభ్యర్థులను ఏడు ప్యాకేజీలుగా విభజిస్తారు. మేనేజర్లకు రెండు, అసిస్టెంట్లకు ఐదు ప్యాకేజీలు ఉంటాయి. వీరి జీతాల కోసం మొత్తం ఖర్చు సంవత్సరానికి రూ.31.70 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, భూ సేకరణపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష