Telangana Cabinet Meeting (Photo/X/Congress)

Hyderabad, Jan 4: తెలంగాణ కేబినెట్‌ సమావేశం (Telangana Cabinet Today) శనివారం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో రైతులకు సాయం కింద ఇచ్చే రైతు భరోసాపైనే ప్రధానంగా చర్చ జరుగనున్నది. రైతు భరోసా షరతులు, విధివిధానాలపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సబ్‌ కమిటీ భేటీలో భరోసా అమలుపై కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. జనవరి 5 నుంచి 7 వరకు రైతు భరోసా కోసం దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. అయితే, షరతులు లేని రైతు భరోసా కావాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి కేబినెట్‌ మీటింగ్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

రీజనల్ రింగ్‌ రోడ్డు విషయంలో రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన, భూ సేకరణపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష

వీటిపై కూడా చర్చ

రైతు భరోసాతో పాటు రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై కూడా కేబినేట్ భేటీలో చర్చ జరుపనున్నట్టు తెలుస్తోంది. కొత్త ఇంధన పాలసీపై కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చిస్తామని డిప్యూటీ సీఎం భట్టి ఇదివరకే ప్రకటించడం తెలిసిందే.

తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్ బాబు, అధ్యక్ష పదవి నుండి తప్పుకున్న కేటీఆర్