VIP Darshan at Yadadri: తిరుమల తరహాలో యాదాద్రిలోనూ బ్రేక్ దర్శనాలు ప్రారంభం.. ఉదయం 9-10, సాయంత్రం 4-5 గంటల మధ్య బ్రేక్ దర్శనాలు.. టికెట్ రూ. 300.. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా టికెట్లు తీసుకున్న 292 మంది భక్తులు.. చంద్రగ్రహణం సందర్భంగా 8న ఆలయం మూత

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో తిరుమల తరహా బ్రేక్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో నిన్నటి నుంచి వీవీఐపీ, వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రవేశపెట్టారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు రెండు గంటలపాటు బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు.

Yadadri (Credits: Twitter)

Yadadri, November 1: తెలంగాణలోని (Telangana) ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రిలో (Yadadri) తిరుమల (Tirumala) తరహా బ్రేక్ (Break) దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆలయంలో (Temple) నిన్నటి నుంచి వీవీఐపీ, వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రవేశపెట్టారు. ప్రతి రోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు రెండు గంటలపాటు బ్రేక్ దర్శనాలు కల్పిస్తున్నట్టు ఆలయ ఈవో గీత తెలిపారు. టికెట్ ధర. రూ 300. కాగా, కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా రెండు దఫాలుగా 292 మంది భక్తులు ఈ టికెట్లు తీసుకున్నారని, వీటి ద్వారా రూ. 87,600 ఆదాయం సమకూరినట్టు చెప్పారు.

గురుగ్రామ్‌లో దారుణం.. హోటల్‌లో పదో తరగతి బాలికపై ఐదుగురి సామూహిక అత్యాచారం.. బాలికను బైక్‌పై ఎక్కించుకుని హోటల్‌కు తీసుకెళ్లిన ఇద్దరు స్నేహితులు.. అక్కడ మరో ముగ్గురితో కలిసి అత్యాచారం.. ఇద్దరి అరెస్ట్

కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా యాదాద్రి నిన్న భక్తులతో కిటకిటలాడింది. 354 జంటలు సత్యనారాయణస్వామి వ్రతాల్లో పాల్గొన్నాయి. వీటి ద్వారా రూ. 2,83,200 ఆదాయం ఆలయానికి సమకూరింది. కాగా, సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 8న యాదాద్రిలోని ప్రధాన, అనుబంధ ఆలయాలను మూసివేయనున్నారు. ఆ రోజున ఉదయం 8.15 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ద్వారబంధనం జరుగుతుందని ఈవో గీత తెలిపారు. కార్తీక పౌర్ణమి రోజున మధ్యాహ్నం 2.37 గంటలకు గ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.19 గంటలకు వీడుతుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement