Dalits Tortured: అప్పుతీర్చలేదని 16 మంది దళితులను రూమ్‌లో వేసి తాళం వేశాడు! గర్భిణీని కూడా బంధించి చిత్రహింసలు, అబార్షన్ అవ్వడంతో వదిలిపెట్టిన నిందితుడు, కర్ణాటకలో బీజేపీ నేత దారుణం

నాలుగు కుటుంబాలకు చెందిన 16 మంది దళితుల్ని ఒక గదిలో బంధించాడు. దాదాపు 15 రోజులపాటు గదిలోనే ఉంచి, చిత్ర హింసలకు పాల్పడ్డాడు. వారిలో అర్పిత అనే ఒక గర్భిణి కూడా ఉంది. ఆమెపై కూడా దాడి చేస్తూ, తిడుతూ హింసకు పాల్పడ్డాడు. దీంతో ఆమె తన గర్భం కోల్పోయింది.

Credit @ Google

Chikkamagaluru, OCT 12: కర్ణాటకలో దారుణం జరిగింది. తీసుకున్న డబ్బు చెల్లించలేదని, తన దగ్గర పని చేసే 16 మంది దళితుల్ని ఒక గదిలో వేసి తాళం (Locked Up In Room) వేశాడు యజమాని. వారిలో ఉన్న ఒక గర్భిణి (Pregnant) తన బిడ్డను కోల్పోయింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక, చిక్కమగళూరుకు చెందిన జగదీష గౌడ అనే వ్యక్తి బీజేపీకి చెందిన నేత. అతడికి కొన్ని కాఫీ ప్లాంట్లున్నాయి. ఈ తేయాకు తోటల్లో కొందరు దళితులు పని చేసే వాళ్లు. అయితే, వీళ్లు యజమాని దగ్గరి నుంచి రూ.9 లక్షలు అప్పుగా తీసుకున్నారు. కానీ, వాళ్లు వాటిని సమయానికి చెల్లించలేకపోయారు. దీంతో జగదీష గౌడ (Jagadeesha gowda), అతడి కొడుకు తిలక్ గౌడ (Tilak gowda) కలిసి నాలుగు కుటుంబాలకు చెందిన 16 మంది దళితుల్ని ఒక గదిలో బంధించాడు. దాదాపు 15 రోజులపాటు గదిలోనే ఉంచి, చిత్ర హింసలకు పాల్పడ్డాడు. వారిలో అర్పిత అనే ఒక గర్భిణి కూడా ఉంది. ఆమెపై కూడా దాడి చేస్తూ, తిడుతూ హింసకు పాల్పడ్డాడు. దీంతో ఆమె తన గర్భం కోల్పోయింది.

Bihar Shocker: యువకుడి గూద ద్వారంలో ఇరుక్కుపోయిన 14 సెంటీమీటర్ల స్టీల్ గ్లాస్, కడుపునొప్పి అని డాక్టర్ దగ్గరకు వెళ్లగా, ఎక్స్ రే చూసి డాక్టర్లు షాక్  

అయితే, ఈమెను ముందుగానే వదిలిపెట్టాడు. వారిలో ఇంకొందరిని తర్వాత వదిలిపెట్టాడు. మరో పది మంది వరకు బంధీలుగానే ఉంచాడు. బయటకు వచ్చిన వాళ్లంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాళ్లను బంధించి ఉంచిన స్థలానికి చేరుకుని, బంధీలుగా ఉన్న వారిని విడిపించారు. వారిలో కొందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Heroin Seized: రూ.47కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టివేత, సబ్బు సంచుల్లో పెట్టి స్మగ్లింగ్, అసోంలో స్వాధీనం చేసుకున్న పోలీసులు 

ప్రస్తుతం నిందితులు ఇద్దరూ పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటన రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. నిందితులు బీజేపీ సానుభూతిపరులుగా ఉండటంతో వివాదం ముదిరింది. అయితే, బీజేపీ (BJP) మాత్రం నిందితులతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, వారికి పార్టీలో సభ్యత్వం కానీ, పదవి కానీ లేదని చెప్పింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement